చిరు పేరిట వున్న ఒక్క రికార్డ్‌ ఆంఫట్‌

నాన్‌-బాహుబలి రికార్డులన్నీ సొంతం చేసుకున్న ‘ఖైదీ నంబర్‌ 150’కి ఉత్తరాంధ్రలో మాత్రం బాహుబలి రికార్డుని కొట్టిన ఘనత దక్కింది. ఉత్తరాంధ్ర చరిత్రలో తొలి పది కోట్ల చిత్రంగా నిలిచిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిరంజీవి సత్తాని తెలియజెప్పింది. అయితే గత రెండేళ్లలో వైజాగ్‌ ఏరియా బిజినెస్‌ గణనీయంగా పెరిగింది. బాహుబలి తొమ్మిది కోట్ల షేర్‌ రాబట్టిన తర్వాత పలు చిత్రాలు దానికి దగ్గరగా వచ్చాయి.

ఖైదీ అయితే పదమూడు కోట్ల షేర్‌తో ఏరియా రికార్డు సాధించింది. ఈ రికార్డుని ‘బాహుబలి 2’ కేవలం ఆరే రోజుల్లో అధిగమించింది. పద్నాలుగు కోట్ల షేర్‌తో ఇప్పుడు ‘బాహుబలి’ ఉత్తరాంధ్రలో కొత్త బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసింది. పదమూడు కోట్ల రేషియోలో ఈ ఏరియా హక్కులు తీసుకున్న బయ్యర్‌కి కేవలం ఆరు రోజుల్లోనే లాభాలు వచ్చాయి.

ఈ ఏరియాలో పాతిక కోట్ల షేర్‌ రాబట్టే అవకాశముందని ట్రేడ్‌ అంటోంది. అదే జరిగితే ఇప్పట్లో ‘బాహుబలి 2’ రికార్డుని బీట్‌ చేయడం కాదు కదా, కనీసం దగ్గర్లోకి వెళ్లే సినిమా కూడా వుండదని ఫిక్స్‌ అయిపోవచ్చు .