కులం పేరుతో తొక్కేస్తారనే భయం లేదు: హేమ

క్యారెక్టర్ నటి హేమ కాపు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సభలో పాల్గొన్నారు. కంచం, గరిటె పట్టుకుని వాయిస్తూ కాపుల ఆకలి బాధలు తెలిపిన ఈ సభలో హేమ పాల్గొనడమే కాకుండా కాపు అనే ఫీలింగ్తో తనకి అవకాశాలివ్వరేమో, ఇకపై తొక్కేస్తారేమో అనే భయం తనకి లేదని తేల్చి చెప్పింది.

ఇంతకాలం టాలెంట్ని నమ్ముకుని ఫీల్డులో రాణించానని, ఇకపై కూడా ప్రతిభతోనే అవకాశాలు సాధించుకుంటానని, కాపుల కోసం జరిగే ఉద్యమాలకి ఉడతా భక్తిగా ఎప్పుడైనా వచ్చి తన మద్దతు తెలియజేస్తానని హేమ ప్రకటించింది.

అన్ని కులాల వారూ ఉన్న తెలుగుదేశం పార్టీ మేనిఫేస్టోలో కాపులకి న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు మాటిచ్చారని, దానిని ఆమోదించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కాపు ఉద్యమాలని వ్యతిరేకించడం సబబు కాదని హేమ పేర్కొంది. హేమ ఉత్సాహం, ఉఉద్రేకం చూస్తుంటే క్యాస్ట్ ట్యాగ్ వాడుకుని పాలిటిక్స్లోకి దూకే ఆలోచనలో ఉన్నట్టే కనిపిస్తోందని ఆమె దూకుడు చూసిన వారు కామెంట్ చేస్తున్నారు.

పెద్ద ప్లాన్స్ ఉన్నాయి కనుకే కెరియర్ ఏమవుతుందోననే భయం లేకుండా ఇలా మాట్లాడేసిందని చెప్పుకుంటున్నారు. నిజమేనా హేమా… రాజకీయాల్లోకి దిగే ఉద్దేశం ఉందా? అదే నిజమైతే దానికి కులం ముసుగు అవసరమంటావా?