హాట్‌ ఎంతమంది వున్నా ఈవిడే హాటెస్ట్‌ స్త్రీ

దీపిక పదుకొనే హాలీవుడ్‌లోను అడుగుపెట్టి ఏ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఈవెంట్‌లో అయినా తనే ముందుండి మెరిసిపోయింది. ఆమె హాలీవుడ్‌ ప్రయత్నం ఆశించిన ఫలితాలని ఇవ్వకపోయి వుండొచ్చు కానీ దీపిక ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఐకాన్‌గా మారింది.

ఆమె పేరు చెబితే గుర్తించని గ్లామర్‌ ప్రియులు ప్రపంచంలో వుండరనేంతగా ఎటు చూసినా తనే కనిపించింది. చిత్ర విచిత్రమైన దుస్తుల్లో తన అందచందాలని ఒలకబోసిన దీపికతో పోటీ పడేందుకు ప్రియాంక చోప్రా లాంటి వాళ్లు చాలా మెట్లు దిగాల్సి వచ్చింది. అదే పనిగా బికినీల్లో కనిపించి మీడియా దృష్టిని ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది.

అయినప్పటికీ మాగ్జిమ్‌ పత్రిక టాప్‌ 100 మంది హాట్‌ స్త్రీల గురించి నిర్వహించిన పోల్‌లో ఈ ఏడాదికి ‘హాటెస్ట్‌ వుమన్‌’గా దీపిక కిరీటాన్ని గెలుచుకుంది. అంతమందిలో తనకే ఎందుకు నంబర్‌వన్‌ స్థానం దక్కిందనే అనుమానమే రానవసరం లేకుండా కవర్‌పేజీ స్టిల్‌తోనే దీపిక డౌట్స్‌ అన్నీ తీర్చేసింది.