డర్టీ హరి చూపు.. ఓటిటి వైపు

ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు టాలీవుడ్ లో ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించిన సంగతి తెల్సిందే. అప్పట్లో నిర్మాతగా ఉండి సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు ఎమ్మెస్ రాజు. దర్శకుడిగా వాన, తూనీగ తూనీగ సినిమాలను డైరెక్ట్ చేసిన ఎమ్మెస్ రాజు సక్సెస్ కాలేకపోయాడు. అయితే ఈ సినిమాలు ఫీల్ గుడ్ గా పేరు సంపాదించుకున్నాయి. క్రమంగా దర్శకత్వానికి, నిర్మాణానికి దూరంగా జరిగిన ఎమ్మెస్ రాజు, ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పట్టడం విశేషం. ఎమ్మెస్ రాజు దర్శకుడిగా డర్టీ హరి అనే చిత్రం రూపొందుతోన్న విషయం తెల్సిందే.

టైటిల్ చూస్తుంటేనే ఇది ఏ జోనర్ సినిమానో, ఎవర్ని టార్గెట్ చేసి తెరకెక్కించారో క్లియర్ గా అర్ధమైపోతుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓటిటి రిలీజ్ అయితేనే బెస్ట్ అని భావిస్తున్నారు.

ప్రస్తుతం చిన్న సినిమాలకు ఓటిటి రిలీజ్ అనేది వరంగా మారింది. ఈ నేపథ్యంలోనే డర్టీ హరి ఓటిటి వైపు చూస్తోందని తెలుస్తోంది. అయితే ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, ఎందులో రిలీజ్ అవుతుంది వంటి విషయాలపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. శ్రవణ్ రెడ్డి ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా, సిమ్రత్ కౌర్ హీరోయిన్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.