మహేష్‌ డేట్‌ మీద కన్నేసిన బన్నీ!

‘స్పైడర్‌’ చిత్రాన్ని జూన్‌ 23న విడుదల చేయాలని అనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేటట్టు లేదు. జూన్‌ 15 వరకు షూటింగ్‌ జరుగుతుందనేది తాజా సమాచారం. అదే జరిగితే లాస్ట్‌ మినిట్‌ టెన్షన్స్‌ వద్దనుకుని రిలీజ్‌ వాయిదా వేస్తారు. మే 19 రిలీజ్‌ మిస్‌ అయిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’కి ఇంకా డేట్‌ ఫిక్స్‌ అవలేదు.

జూన్‌లో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నా కానీ సరైన డేట్‌ ఏంటనేది తేలలేదు. ఒకవేళ ‘స్పైడర్‌’ కనుక వాయిదా పడితే జూన్‌ 23న విడుదల చేయాలని భావిస్తున్నారు. రంజాన్‌ వారాంతం కనుక ఆ సెలవులు కలిసొస్తాయని భావిస్తున్నారు. స్పైడర్‌ రిలీజ్‌ యథాతథంగా వుంటే ‘దువ్వాడ జగన్నాథమ్‌’ జులై 7న రిలీజ్‌ అవుతుంది. ప్రతి వేసవికి తన సినిమా ఒకటి రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటూ వచ్చిన అల్లు అర్జున్‌కి ఈసారి షెడ్యూల్‌ గాడి తప్పింది. కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు షూటింగ్‌కి ఏర్పడిన అంతరాయాలతో ‘దువ్వాడ జగన్నాథమ్‌’ డిలే అయింది.
సమ్మర్‌ హాలిడేస్‌ మిస్‌ అవడంతో లాంగ్‌ వీకెండ్‌ కలిసి వచ్చేలా రిలీజ్‌ ప్లాన్‌ చేయాలని అనుకుంటున్నారు. స్పైడర్‌ దారిచ్చేస్తే జూన్‌ 23న దువ్వాడ రావడం పక్కా. లేదంటే ఈసారికి హాలిడే సపోర్ట్‌ లేకుండానే బన్నీ తన సత్తాని పరీక్షించుకోవాలి.