అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న గంగవ్వ

గంగవ్వ దాదాపు 58 ఏళ్ల వయసులో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఒక సెన్సేషన్. యూట్యూబ్ ద్వారా ఫేమ్ ను సంపాదించుకున్న గంగవ్వ ఆ ఫేమ్ కారణంగా బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ వయసులో గంగవ్వ బిగ్ బాస్ లో అందరినీ అలరించారు. తనదైన శైలి మాట విరుపులతో గంగవ్వ అందరినీ ఆకట్టుకున్నారు. అత్యధిక ఓట్లతో నామినేషన్స్ నుండి కూడా పలుమార్లు బయటపడ్డారు.

ఇక షో నుండి అనారోగ్య కారణాల వల్ల అర్ధాంతరంగా బయటకు వచ్చేసారు గంగవ్వ. షో నుండి బయటకు వచ్చాక ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ యాజమాన్యంతో కలిసి నాగార్జున గంగవ్వ సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా గంగవ్వ తాను వైద్యం చేయించుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసారు. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతోన్న గంగవ్వ ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నారు. గంగవ్వ త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.