అక్కడ శాతకర్ణి జెండా రెపరెపలు

ఊహించినట్టుగానే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఓవర్సీస్‌లోనే ముందుగా సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌ అయింది. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ క్రిష్‌ బ్రాండ్‌ వేల్యూ, హిస్టారికల్‌ సబ్జెక్ట్‌, డీసెంట్‌ టాక్‌తో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌ వీకెండ్‌లోనే మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఫస్ట్‌ వీకెండ్‌ ముగిసే సరికి 1.2 మిలియన్‌ డాలర్లు సాధించిన శాతకర్ణి ఓవర్సీస్‌లో సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌ అయినట్టే. అయిదు కోట్లకి ఈ చిత్రం రైట్స్‌ సొంతం చేసుకున్న బయ్యర్‌కి డీసెంట్‌ ప్రాఫిట్స్‌ రావడం తథ్యం. సెకండ్‌ వీకెండ్‌ కూడా స్ట్రాంగ్‌గా వుంటుందని, మరో అయిదు లక్షల డాలర్ల వరకు వసూలు చేయగలదని ఓవర్సీస్‌ ట్రేడ్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి.

రెండు మిలియన్‌ డాలర్లు సాధించే అవకాశాలు సైతం లేకపోలేదని ఓవర్సీస్‌ బయ్యర్లు అంటున్నారు. బాలకృష్ణని యుఎస్‌ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలయ్య టూర్‌ వేస్తే ఈ చిత్రం రెండు మిలియన్‌ డాలర్లు సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. లోకల్‌గాను పండుగ రోజుల్లో సూపర్‌గా పర్‌ఫార్మ్‌ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి ఇక వీక్‌డేస్‌లో ఎలా పర్‌ఫార్మ్‌ చేస్తుందనేది చూడాలి. ఫస్ట్‌ వీకెండ్‌ స్ట్రాంగ్‌గా ఉంది కనుక ఇకపై డీసెంట్‌గా నడిచినా సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌ అవడం అంత కష్టమేం కాదు మరి.