స్టార్‌ డైరెక్టర్‌ సెక్స్‌ ముచ్చట్లు

సెక్స్‌ గురించి, ఆంతరంగిక విషయాల గురించి, ప్రైవేట్‌ యవ్వారాల గురించి పబ్లిగ్గా మాట్లాడితేనే సమకాలీన పరిస్థితులతో సమంగా నడుస్తున్నట్టు అని భావిస్తున్నారు చాలా మంది. ఇలాంటి దరిద్రాలని సెలబ్రిటీ స్టేటస్‌ వున్నవాళ్లే అవలంబిస్తూ వుండడంతో వీళ్లని రోల్‌ మోడల్స్‌గా తీసుకునే యువత కూడా అదే ట్రెండుని ఫాలో అవుతోంది.

బాధ్యతాయుతమైన సినీ దర్శకుడై వుండీ, ఇండియాలో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ధర్మా ప్రొడక్షన్స్‌ అధినేత అయిన కరణ్‌ జోహార్‌ నానాటికీ సిగ్గు విడిచేస్తున్నాడు. తన సెక్సువల్‌ ప్రిఫరెన్స్‌ గురించి చెప్పుకోలేనంటూ తాను ‘గే’ అనే విషయాన్ని తన ఆత్మకథలో రాసుకున్న కరణ్‌ జోహార్‌ ‘కాఫీ విత్‌ కరన్‌’ అనే సూపర్‌హిట్‌ టాక్‌ షో ఒకటి నిర్వహిస్తుంటాడు. ఈ షో తాజా సీజన్‌లో టీఆర్పీల కోసం కరన్‌ పూర్తిగా సెక్స్‌ ముచ్చట్ల మీదే ఫోకస్‌ పెడుతున్నాడు.

గెస్ట్‌లు ఎవరు వచ్చినా కానీ అతను మాట్లాడే దాంట్లో అరవై శాతం సెక్స్‌కి సంబంధించిన ముచ్చట్లే వుంటాయి. గెస్ట్‌లు ఆడవాళ్లయినా, మగవాళ్లయినా అతనికేం ఫరక్‌ పడదు. తానెలాగో గే నుక అమ్మాయిలు కూడా ఫ్రీగా ఓపెన్‌ అయిపోతారని భావిస్తున్నాడో ఏమిటో తనకే తెలియాలి. ఈ షోకి అడల్ట్‌ రేటింగ్‌ ఇచ్చి అర్థరాత్రి తర్వాతే ప్రసారం చేయాలన్నంత దారుణంగా కాన్వర్‌జేషన్లు వుంటున్నాయి. ఎంత సంచలనాత్మకంగా మాట్లాడితే అంత కవరేజ్‌ వస్తుందనుకునే ఆడవాళ్లు, మగవాళ్లు కరన్‌ అడిగే సిగ్గులేని ప్రశ్నలకి అంతే నిర్లజ్జగా సమాధానాలిస్తున్నారు.