మా సినిమాతో పోటీకి దిగడం ఆ హీరో తప్పే!

‘కాబిల్‌’ చిత్రంతో షారుక్‌ఖాన్‌ ‘రయీస్‌’ పోటీగా రిలీజ్‌ అవడం పట్ల హృతిక్‌రోషన్‌ హ్యాపీగా లేడు. ‘సుల్తాన్‌’తో క్లాష్‌ అవాయిడ్‌ చేయడం కోసం ‘రయీస్‌’ని ఆరు నెలలు వాయిదా వేసారు. అయితే అప్పటికే రిపబ్లిక్‌ డే రిలీజ్‌ అనౌన్స్‌ చేసిన రాకేష్‌ రోషన్‌ దీనిని తప్పుబట్టారు. ఒక సినిమాతో పోటీ అవాయిడ్‌ చేయడానికి మరో చిత్రంతో పోటీకి రావడమేంటని ఆయన ప్రశ్నించారు. హృతిక్‌ రోషన్‌ కూడా ఇలాగే స్పందించాడు.

ఈ పోటీ పట్ల తన తండ్రి అస్సలు సంతోషంగా లేరని, ఆయన చాలా డిజప్పాయింట్‌ అయ్యారని చెప్పాడు. అక్టోబర్‌, నవంబర్‌లోనే విడుదల చేద్దామనుకున్న కాబిల్‌ని వేరే చిత్రాలకి స్పేస్‌ ఇవ్వడం కోసం రిపబ్లిక్‌ డే రిలీజ్‌కి ఫిక్స్‌ చేసుకున్నామని, తాము వస్తున్నామని తెలిసి కూడా ‘రయీస్‌’కి అదే డేట్‌ తీసుకున్నారని అతను అసంతృప్తి వ్యక్తం చేసాడు. వాళ్ల సమస్యలు కూడా అర్థం చేసుకోగలనని, కానీ అందరికీ మంచి జరిగేట్టుగా నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని, రెండు చిత్రాలు ఒకేసారి విడుదల కావడం వల్ల ఇరువురికీ నష్టం ఉంటుందని అన్నాడు.

హృతిక్‌ గత చిత్రం ‘మొహంజుదారో’ కూడా ‘రుస్తుం’తో పోటీ పడింది. హృతిక్‌ సినిమా డిజాస్టర్‌ అయితే రుస్తుం హిట్టయింది. ఆ అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని హృతిక్‌ ఈ క్లాష్‌ పట్ల నిరాశగా ఉన్నట్టున్నాడు.