త‌ల్లి ఎందుకు మాట్లాడ‌టం మానేసిందో చెప్తున్న జ‌గ‌ప‌తిబాబు

జ‌గ‌ప‌తిబాబు…తెలుగు ఇండస్ట్రీలో ప్ర‌ముఖ న‌టుడు. మూస పాత్రల‌కు ప‌రిమితం అవ‌కుండా హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్ర‌ల్లో న‌టించి మెప్పించిన స‌త్తా ఆయ‌న సొంతం. సాధార‌ణంగా భోళాగా ఉండే జ‌గ‌ప‌తి బాబు ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో సినిమాల గురించి మొదలుకొని తన వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి మాట్లాడాడు. ఈ క్ర‌మంలో ఏ ఒక్క అంశంపై కూడా దాప‌రికం లేకుండా క్లారిటీ ఇవ్వ‌డం ఆస‌క్తికరం.

త‌న సినీ ప్ర‌యాణం గురించి చెప్తూ…సినీ రంగంలోకి అడుగుపెట్టే సంద‌ర్భంలో ఇక్క‌ట్లు ఎదురైన‌ట్లు జ‌గ‌ప‌తి బాబు గుర్తుచేసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సినిమాల్లోకి వెళ్లొద్ద‌ని త‌న త‌ల్లి ఆర్డ‌ర్ వేసింద‌ని జ‌గ‌ప‌తి బాబు తెలిపారు. అయితే త‌న‌కున్న ఆస‌క్తితో సినిమాల్లోకి వ‌చ్చినందుకు నొచ్చుకున్న అమ్మ‌ రెండు సంవ‌త్స‌రాల‌పాటు త‌న‌తో మాట్లాడ్డం మానేసింద‌ని జ‌గ‌ప‌తిబాబు వివ‌రించారు. దీంతో పాటుగా మ‌రో రెండు అంశాల్లోనూ తన మాతృమూర్తి మాట్లాడ‌టం మానేసింద‌ని తెలిపాడు. సిగ‌రెట్ తాగుతున్న‌ట్లు తెలిసిన త‌ర్వాత రెండేళ్లు, ఓ అమ్మాయితో తిరుగుతున్నాన‌ని మ‌రో రెండేళ్లు త‌న త‌ల్లి త‌న‌తో మాట్లాడ‌డం మానేసింద‌ని జ‌గ‌ప‌తి బాబు వివ‌రించాడు.

ఈ సంద‌ర్భంగా సినీ రంగంలోని హీరోయిన్ల గురించి త‌న‌కున్న అభిప్రాయం, త‌న‌పై వ‌చ్చిన ఎఫైర్ల గురించి కూడా జ‌గ‌ప‌తి బాబు వివ‌ర‌ణ ఇచ్చాడు.హీరోయిన్ సౌంద‌ర్య‌తో త‌న అఫైర్ నిజం కాద‌ని జ‌గ‌ప‌తి బాబు క్లారిటీ ఇచ్చాడు. ఎవ‌రినీ అంత తొంద‌ర‌గా న‌మ్మే మ‌న‌స్త‌త్వం కాని సౌంద‌ర్య త‌న‌ను మాత్రం విప‌రీతంగా అభిమానించింద‌ని తెలిపారు. అంతేకాకుండా త‌న కుటుంబానికి కూడా ద‌గ్గ‌ర చేసింద‌ని వివ‌రించారు. అంతే త‌ప్ప త‌మ మ‌ధ్య అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా అఫైర్‌లాంటిదేమీ లేద‌ని స్ప‌ష్టం చేశాడు. హీరోయిన్‌ ప్రియ‌మ‌ణి చాలా హాట్‌గా ఉంటుంద‌ని జ‌గ‌ప‌తి బాబు వ్యాఖ్యానించాడు. త్రిష అంటే క్ర‌ష్ అని చ‌మత్క‌రించాడు.  త్రిష‌తో ఒక్క సినిమా అయినా చేద్దామ‌నుకున్నాన‌ని, అయితే కుద‌ర్లేద‌ని  మ‌న‌సులోని మాట‌ను ఏ మాత్రం దాచుకోకుండా చెప్పేశాడు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ త‌న‌కు ప్రాణ స్నేహితుడ‌ని, జూనియ‌ర్‌ ఎన్టీయార్ స‌న్నిహితుడ‌ని జ‌గ‌ప‌తి బాబు వివ‌రించారు.