బిగ్‌న్యూస్‌: మరో ‘జనతా గ్యారేజ్‌’ కన్ఫర్మ్‌ అయ్యింది

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్‌ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం కొరటాల శివ ఇండస్ట్రీలోనే టాప్‌ స్టార్‌ డైరెక్టర్‌. ఆయనతో సినిమాలకు స్టార్‌ హీరోలు సీనియర్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య చిత్రంను చేస్తున్న కొరటాల శివ ఆ వెంటనే అల్లు అర్జున్‌ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఈ ఏడాదిలో కొరటాల, బన్నీల కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బన్నీతో సినిమా తర్వాత కొరటాల శివ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌ తో చేసే విషయమై చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. జనతా గ్యారేజ్‌ తర్వాత మళ్లీ వీరి కాంబోలో సినిమా ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే ఎన్టీఆర్‌ ను కలిసిన కొరటాల శివ కథ చెప్పడం జరిగిందట. కథ నచ్చడంతో ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది. మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్‌ ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కనుక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌ లో కాని ద్వితీయార్థంలో కాని ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు.