బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ : మహేష్‌ హీరోయిన్‌పై ట్రోల్స్‌

మొన్నటి వరకు అమెరికాను కరోనా కుదిపేస్తుంది. కరోనా నుండి ఇంకా అమెరికా బయట పడకుండానే అంతకు మించిన కుదుపు జార్జ్‌ ప్లాయిడ్‌ హత్యోదంతంపై నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. నల్ల జాతీయుడు అయిన జార్జ్‌ ప్లాయిడ్‌ ను పోలీసులు నడి రోడ్డు మీద చంపడంతో అమెరికాలో నల్ల జాతీయులు అంతా కూడా రోడ్డు ఎక్కారు. అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ వారిని ఎంతగా కట్టడి చేసేందుకు ప్రయత్నించినా కూడా అల్లర్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు వాటి తగ్గుదల కనిపించడం లేదు.

ఈ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా జార్జ్‌ ప్లాయిడ్‌ ఉదంతంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. నిరసనకారులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రముఖులు బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇండియన్‌ సెలబ్రెటీలు కూడా ఈ హ్యాష్‌ ట్యాగ్‌తో జార్జ్‌ ప్లాయిడ్‌ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ విషయంలో స్పందిస్తూ న్లటి ఇమేజ్‌ ను పోస్ట్‌ చేసి బ్లాక్‌ ఔట్‌ ట్యూస్‌డే అంటూ ట్వీట్‌ చేశాడు. తాజాగా కియారా అద్వానీ కూడా ఈ హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్వీట్‌ చేసింది. అయితే ఆమెకు ఈ విషయంలో స్పందించే అర్హత లేదు అంటూ నెటిజన్స్‌ విమర్శలు చేస్తూ ఉన్నారు.

కియారా అద్వానీ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. నల్ల చర్మంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ తెలుపు చర్మం పట్ల మమకారం చూపించే నీకు ఈ విషయంలో స్పందించే హక్కు ఎక్కడిది అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. నల్ల జాతీయులు, నల్లని చర్మం ఉన్న వారు అంటేనే నీకు నచ్చదు అన్నట్లుగా ఆ ఫెయిర్‌ నెస్‌ క్రీమ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నావు. కనుక నీవు ఈ విషయంలో స్పందించవద్దంటూ ఆమెను టార్గెట్‌ చేసి కొందరు కామెంట్స్‌ పెట్టారు. ఈ విషయంలో కియారా అద్వానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.