ఆ రాత్రంతా కాజల్ కు నిద్ర పట్టదట

పెళ్లి పేరెత్తితే ఏ అమ్మాయికైనా బుగ్గలు ఎరుపెక్కుతాయి.. కానీ, హీరోయిన్లకు మాత్రం కళ్లు ఎరుపెక్కుతాయి. పెళ్లి పేరెత్తితే చాలు వారు మండిపడిపోతారు. ఈ మధ్య కొందరు తెలివిగా నచ్చినవాడు దొరకాలి కదా అంటున్నారు.. ఇదంతా ఎలా ఉన్నా కెరీర్ ఎండింగ్ స్టేజికి చేరుకుంటున్న దశలో చిరంజీవి పుణ్యమా అని టాలీవుడ్ లో హిట్ కొట్టిన సుందరి కాజల్ కూడా పెళ్లి గురించి అడిగితే అప్పుడే కాదనేస్తోంది.  పదేపదే ఇదే ప్రశ్న అడుగుతుంటే చిరాకొస్తోందని అంటోంది. సరైన సమయంలో, సరైన వ్యక్తి దొరికినప్పుడు ఆ విషయం ఆలోచిస్తానని అందరు చెప్పే మాటనే చెప్పింది.  కొన్నికొన్ని సినిమాలు చూశాక రాత్రుళ్లు ఒంటరిగా పడుకోలేకపోతున్నాననీ అంటోంది.

రీసెంటుగా సోషల్ మీడియాలో తన అభిమానులతో చాటింగ్ చేసిన కాజల్…  చాలా సంగతులు పంచుకుంది.   వ్యోమగామి కావాలనుకుని చివరకు హీరోయిన్ గా స్థిరపడ్డానంటూ తన చిన్ననాటి కోరిక తీరనందుకు కాస్త ఆవేదన కూడా చెంది.

అయితే.. రొమాంటిక్ కామెడీ సినిమాలంటే పడిచచ్చే కాజల్ హార్రర్‌ సినిమాలు కూడా చూస్తుందట.  కానీ.. హార్రర్‌ సనిమాలు చూశాక ఆ రాత్రంతా నిద్ర పట్టదట. పాపం… హర్రర్ సినిమాలు చూసి భయంతో ఒంటరిగా పడుకునే కంటే తోడు చూసుకుంటే బెటర్ కదా అంటున్నారు కుర్రకారు.