కాజల్ అగర్వాల్ డిజిటల్ డెబ్యూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో రాణించిన కాజల్ అగర్వాల్ ఇటీవలే తాను కూడా ఓటిటి ఎంట్రీ ఇస్తోన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

కాజల్ లీడ్ రోల్ లో వైభవ్, ఆనంది కలిసి నటించిన హారర్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ ఫిబ్రవరి 12 నుండి స్ట్రీమ్ కానుంది. హాట్ స్టార్ లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తోంది. సమంత కీలక పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా ఇదే రోజు విడుదల కానుండడం విశేషమే.

తమిళ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేసాడు. ఈ లైవ్ టెలికాస్ట్ తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠి భాషల్లో అందుబాటులోకి వస్తోంది. కాజల్ పెళ్లి తర్వాత విడుదలవుతోన్న ఈ సిరీస్ పై అంచనాలు ఆటోమేటిగ్గా భారీగానే ఉండనున్నాయి. మరి కాజల్ ఓటిటి ఎంట్రీ ఏ విధంగా ఉండబోతోందో చూడాలి.