Karthika Deepam Serial 10th January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 700 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 701 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 10) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

హిమ, సౌర్యల స్కూల్లో ఫంక్షన్‌కి దీప, సౌందర్య, ఆనందరావులు కూడా వెళ్తారు. కార్తీక్ చూసుకోకుండా దీప, సౌర్యల పక్కనే కూర్చుంటాడు. పిల్లలకు ఫ్రైజ్ ఇవ్వడానికి మౌనిత ఎంట్రీ ఇస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత హిమ రాసిన ‘నాన్న’ అనే వ్యాసాన్ని కార్తీక్ స్టేజ్ మీద చదువుతూ భావోద్వేగాలకు గురవుతాడు. సీన్ కట్ చేస్తే.. హిమకి మౌనిత, కార్తీక్ కలిపి ఫ్రైజ్ ఇస్తుంటే.. ‘వంటలక్క మా అమ్మలాగే.. తనూ మా డాడీ కలిసి ఫ్రైజ్ ఇవ్వాలని అని కోరుతుంది. దాంతో మౌనిత రగిలిపోతుంది.

Read also: ‘కార్తీకదీపం’ గత ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి..

రగిలిపోయిన మౌనిత

‘వంటలక్క స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను’ అనగానే.. దీప పైకి వెళ్లి హిమని హగ్ చేసుకుంటుంది. ముద్దాడుతుంది. మౌనిత కోపాన్ని అనుచుకుంటూ ఉంటుంది. కార్తీక్ అయిష్టంగా చూస్తూ ఉంటాడు. దీప గర్వంగా చూస్తూ.. మౌనిత దగ్గర ఉన్న ఫ్రైజ్ ‘ఇవ్వు’ అన్నట్లుగా చెయ్యి చాపుతుంది. మౌనిత చాలా అసహనంతో దీపకు ఫ్రైజ్ అందిస్తుంది. కార్తీక్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ‘సార్ మీరిద్దరూ ఫ్రైజ్ ఇవ్వండి’ అనడంతో కార్తీక్.. తప్పని స్థితిలో దీపతో చెయ్యి కలుపుతాడు. వాటన్నింటినీ సౌందర్య ఫొటోస్ తీస్తుంది.

Read also: కార్తీకదీపం అయిపోతుందా? ఏంటి.. ఇవి తేలకుండానే!?
అడ్డుకున్న కార్తీక్!

‘ఇప్పుడు హిమ తన స్పందన తెలియజేయాలి’ అనగానే.. మైక్ అందుకుని.. ‘నాకేమో అమ్మలేదు. సౌర్యకేమో నాన్న లేడు. నాన్నని బాగా చూసుకోవడానికి నాకేమో అమ్మ కావాలి. అందుకని మా డాడీకి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నేను కొత్తమ్మని చూశాను.’ అంటుంది. దీప కంగారు పడుతుంది. కార్తీక్ ఇబ్బందిగా మైక్‌కి చెయ్యి అడ్డుపెట్టి.. ‘జ్యోక్ చేస్తోంది.. అదంతా ఏం లేదు’ అంటూ విషయం చెప్పనీకుండా కిందకు బలవంతంగా హిమని తీసుకుని వెళ్తాడు.

Read also: మహేష్ గారో.. వంటలక్క-కార్తీక్‌లను కలపండి ప్లీజ్.. ఇదెక్కడి గొడవరా ద్యావుడా!

మౌనిత ఆవేశం!

దీప చేతిలో ఉన్న ఫ్రైజ్ తీసుకుని హిమ కార్తీక్‌తో ముందుకు కదలుతుంది. సీన్ కట్ చేస్తే.. అక్కడ ఉన్నవాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతారు. మౌనిత మాత్రం ఒక్కర్తే మిగిలిపోతుంది. అక్కడున్న బెలూన్స్, కుర్చీలు తన్నేస్తూ.. ‘నో.. నో..’ అంటూ పిచ్చిదానిలా అరుస్తుంది. ఆవేశంతో రగిలిపోతుంది.

ఇదంతా మీ ట్రైనింగేనా?

కార్తీక్ హిమని ఒక చోటకు తీసుకొచ్చి.. కూర్చోబెట్టి.. ‘ఏంటమ్మా స్టేజ్ మీద అలాగేనా మాట్లాడేది?’ అంటూ ఉంటాడు. ఇంతలో సౌందర్య, ఆనందరావులు పరుగున వస్తారు. వెంటనే ‘ఇదంతా మీ ట్రైనింగేనా?’ అంటూ తిడుతూ ఉంటాడు. ఇంతలో అటుగా వెళ్తున్న దీప, సౌర్యలు ఓ పక్కన, మౌనిత మరో పక్క ఆగి వాళ్ల మాటలు వింటూ ఉంటారు.

గుర్తు పెట్టుకో హిమా!

దీపని చూసి కార్తీక్..‘చూడు హిమా.. నీకు ఎప్పుడు చెప్పేది ఒక్కటే.. నీకు నేను నాకు నువ్వు. అంతే. ఇక కొత్తగా మన జీవితాల్లోలకి ఇంకెవ్వరూ లేరు. రారు. గుర్తు పెట్టుకో హిమా’ అని కోపంగా దీపవైపు చూస్తూ వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న సౌర్య కోపంతో రగిలిపోతుంది. హిమ మనసులో బాధపడుతుంది. వెంటనే సౌందర్య హిమని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది.

ఇప్పుడు మాత్రం ఏమైంది?

మౌనిత ఆవేశంగా వెళ్లిపోతుంటే.. కార్తీక్ ఆపుతాడు. ‘హిమకి నీ చేతుల మీద ఫ్రైజ్ ఇస్తే బాగుండేది’ అంటూ మాటవరకు మాట కలుపుతాడు. ‘ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇంకా బాగుందిగా.. హిమకు అమ్మానాన్నలుగా ఆ వంటలక్కా నువ్వు కలిసి బాగానే ఫ్రైజ్ ఇచ్చారుగా.. మీ అమ్మగారు ఎంత తెలియవైనోళ్లో తెలుసా?’ అంటూ తిడుతుంది. కార్తీక్ అర్థం కానట్లుగా చూస్తాడు.

ఒక్కసారి మీ ముందు..

‘మీరు ఫ్రైజ్ ఇస్తున్నప్పుడు ఫొటోస్ తీశారు మీ అమ్మగారు. రేపు కోర్టులో అవి చూపిస్తే నీకు విడాకులు ఇస్తారా?.. అయినా నువ్వు ఎలా పోతే నాకెందుకు?’ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ వెళ్లిపోతుంది. దీప సౌందర్యతో.. ‘అత్తయ్యా.. ఆయన వెళ్లిపోతారేమో.. ఒక్కసారి మీ ముందు విడాకుల గురించి మాట్లాడతాను అత్తయ్యా’ అంటుంది.

కమింగ్ అప్‌లో…

లాయర్ కార్తీక్‌తో మాట్లాడటం హిమ వినేస్తుంది. ‘విడాకులు తప్పకుండా వచ్చేస్తాయి సార్’ అంటాడు కార్తీక్‌తో లాయర్. అది విన్న హిమ షాక్ అవుతుంది. ‘విడాకులా? అమ్మ చనిపోయింది కదా?’ అనుకున్న హిమ.. ఆ విషయాన్ని సౌర్యతో పంచుకుంటుంది. వెంటనే సౌర్య.. ‘మీ అమ్మ చనిపోయిందని మీ డాడీనే చెప్పాడుగా? అందుకే వెళ్లి మీ డాడీని అడుగు. చనిపోయిన అమ్మకి విడాకులు ఎలా ఇస్తున్నావ్? అని అడుగు’ అని సలహా ఇస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.