karthika Deepam Serial 23rd January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 711 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 712 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 23) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

హిమ అందరి ముందూ.. ‘డాడీ వంటలక్క చెబితే వింటాడు’ అని నిర్ణయించుకుని.. ‘వంటలక్కా నాకో సాయం చెయ్యవా.. మా అమ్మకు విడాకులు ఇవ్వద్దని మా డాడీకి చెప్పవా?’ అని అడగడంతో అసలు రగడ మొదలవుతుంది. కార్తీక్ మొదట హిమని కసిరి.. తర్వాత ప్రేమగా దగ్గరకు తీసుకుని.. ‘లేని అమ్మకు విడాకులు ఎలా ఇస్తాను? మీ అమ్మ లేదు నిజంగానే చచ్చిపోయింది. సరే ఇప్పుడు చెబుతున్నాను. అందరి ముందూ చెబుతున్నాను. చచ్చిన మీ అమ్మ రాదు. ఇక జీవితంలో విడాకులనే మాటే రాదు. నేను నీకు మాటిస్తున్నానమ్మా.. విడాకులు ఇవ్వను. నేను చచ్చేదాకా విడాకుల మాటే ఎత్తను..’ అంటూ హిమ చేతిలో చెయ్యి వేసి మాటిస్తాడు కార్తీక్.

ఏంటే రౌడీ?

కార్తీక్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఫుల్ హ్యాపీలో ఉంటారు. దీప అందరికీ రకరకాల వంటలు చేసిపట్టాలని సౌందర్య, ఆదిత్య కోరడంతో ఆపనిలో ఉంటుంది. అసహనంతో రగిలిపోయిన కార్తీక్ బయట నిలబడి ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో సౌర్య అక్కడికి వచ్చి.. ‘డాక్టర్ బాబూ..’ అని పిలుస్తుంది. ‘ఏంటే రౌడీ?’ అంటాడు కార్తీక్. ‘మా అమ్మ అంటే మీకు ఎందుకంత కోపం డాక్టర్ బాబూ?’ అంటుంది సౌర్య బాధగా. ‘ఏంటీ?’ అంటాడు షాక్ అయ్యిన కార్తీక్. ‘మీకు మా అమ్మంటే చాలా కోపం కదా? ఎందుకు?’ అంటుంది సౌర్య మళ్లీ. ‘ఈ ప్రశ్న నిన్ను ఎవరైనా అడగమన్నారా? నువ్వే అడుగుతున్నావా?’ అంటాడు కార్తీక్ అనుమానంగా.. అయితే అదంతా దీప గమనిస్తూ ఉంటుంది.

మేమంటే కోపమెందుకు?

‘నన్ను ఎవ్వరూ ఏమీ అడగమని చెప్పరు డాక్టర్ బాబు. నేనే నాకు ఏది అనిపిస్తే అది ఎవరిని అడగాలంటే వాళ్లని అడుగుతుంటాను. నాదంతా మా నాన్నమ్మ పోలికంట. మీకు తెలుసో లేదు మా నాన్నమ్మ. అయినా మీకు మా నాన్న తెలుసు కదా. మా నాన్నమ్మ కూడా తెలిసే ఉంటుంది’ అంటున్న సౌర్యతో.. కార్తీక్ కాస్త ఇబ్బందిగా చూస్తూ.. ‘ఈ సోదంతా నాకెందుకే?’ అంటాడు. దాంతో సౌర్య ఆ విషయాలన్నీ పక్కనపెట్టి.. ‘మేమంటే కోపమెందుకు?’ అని మరోసారి అడుగుతుంది.

నాకెందుకు కోపం..?

సౌర్య ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాని కార్తీక్.. ‘నీకెందుకు అలా అనిపించింది?’ తిరిగి ప్రశ్నిస్తాడు సౌర్యని. ‘మా అమ్మ వంట చేస్తుందంటే వద్దని పంపించెయ్యాలని చూశారెందుకు? అంటే కోపం ఉన్నట్లే కదా?’ అంటుంది సౌర్య. ‘నాకెందుకు కోపం.. నాకు ఎవరి మీద కోపాలు, ఇష్టాలు ఉండవు. నాకు హిమ ఒక్కర్తే ఇష్టం. ఇంకెవ్వరూ నచ్చరు. ఇంకెవరినీ ఇష్టపడను.’ అని సమాధానం చెప్పి అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోతాడు కార్తీక్. కార్తీక్ సమాధానానికి సౌర్య చాలా బాధపడుతుంది. దూరం నుంచి వింటున్న దీప కూడా బాధపడుతుంది.

దీపను చంపేసినందుకు..

పక్కకు వెళ్లిపోయిన కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వెనుక దీప వచ్చి నిలబడటం చూసి.. ‘నేను మళ్లీ చేస్తాను..’ అని ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే దీప.. ‘థ్యాంక్స్’ అంటుంది. కార్తీక్ ‘ఎందుకు?’ అంటాడు. ‘దీపను చంపేసినందుకు..’ అంటుంది దీప బాధగా. మళ్లీ తనే మాట్లాడుతూ. ‘చచ్చిపోయిన పెళ్లానికి.. చచ్చేదాకా విడాకులు ఇవ్వను అన్నారుగా తమరు. అందుకు!, మీరు నిజంగా దేవుడు డాక్టర్ బాబూ.. ఎప్పుడో హిమ తల్లిని చంపేసి.. ఇప్పుడు ఈ వంటలక్కని బతికించారు’ అంటూ తన మనసులోని మాటలని బయటపెడతుంది.

ఇక్కడే పండుగ చేసుకుంటాను..

దీప మాటలు విన్న కార్తీక్.. ‘గెలిచానుకుంటున్నావా?’ అంటాడు. ‘ఓడిపోలేదనుకుంటున్నాను’ అని సమాధానం ఇస్తుంది దీప. ‘నీకు ఎంత పొగరే’ అంటాడు కార్తీక్ కోపంగా.. ‘లేదు దీనికి అంత పవర్ ఉంది’ అంటూ తాళి బొట్టుని చూపిస్తుంది దీప నవ్వుతూ.. ‘వెళ్లి పండుగ చేసుకో.. పో..’ అంటాడు కార్తీక్. ‘ఇక్కడే పండుగ చేసుకుంటాను, పులిహోరా, పాయసం ఇలా చాలానే రెడీ చేశాను. మీరు వస్తే మీరూ పండుగ చేసుకోవచ్చు’ అంటుంది దీప కనురెప్పలు పైకెత్తుతూ..

ఇందాక చెప్పావుగా?

దీప వెటకారానికి కార్తీక్ రగిలిపోతూ.. ‘నా కూతురు వల్ల నువ్వు బతికిపోతున్నావే..’ అంటాడు. ‘అవును. హిమకి నా మీద ఎంతో ప్రేమ. ఆ ప్రేమ వల్లే నేను బతికిపోయాను’ అంటుంది దీప. ‘ఒప్పుకున్నావ్ గా ఇక పో..’ అంటాడు కార్తీక్. ‘థ్యాంక్స్ చెప్పాలిగా?’ అంటుంది దీప. ‘ఇందాక చెప్పావుగా?’ అంటాడు కార్తీక్ దీప మాటలకు బదులిస్తూ.. ‘ఇందాక చెప్పింది వంటలక్క.. ఇప్పుడు చెప్పేది మీ దీప. అంటే మీ భార్య. విడాకులు ఇస్తే నా బతుకు ఏంటని చాలా కుంగిపోయాను. మీరు మాటిస్తే మీరు తప్పరు డాక్టర్ బాబు. ఈ వంటలక్క ఎలాగైనా చావగలేదు. ఎలాగైనా బతకగలదు. కానీ దీప బతకలేదు. అందుకే మీకు చేతులెత్తి దన్నం పెడుతున్నాను’ అంటూ దన్నం పెడుతుంది. కార్తీక్ దీప చేతులను దన్నం పెట్టకుండా ఆపుతాడు.

నిజం తెలియడం ఇష్టం లేక..

వెంటనే కార్తీక్ కోపంగా చూస్తూ.. ‘నీ మీద ప్రేమతోనో జాలితోనూ నేను నీకు విడాకులు ఇవ్వనని చెప్పలేదు.. నేను నీకు విడాకులు ఇవ్వడం పబ్లిక్ అయితే హిమకు నీ గురించి తెలుస్తుంది. అప్పుడు నువ్వు నా భార్య అనుకుంటుంది. నా భార్య కాబట్టి తన తల్లే అనుకుంటుంది. తల్లిని దూరంగా ఉంచడమేంటని ఇంటికి తీసుకొస్తుంది.. అందుకే హిమకు నిజం తెలియడం ఇష్టం లేక విడాకుల విషయాన్ని వదిలేశాను’ అంటాడు కార్తీక్.

చెబితే పోలా?

కార్తీక్ చెప్పిందంతా కూల్‌గా విన్న దీప నవ్వుతూ.. ‘నేను మీ భార్య అని హిమకు తెలిస్తే.. చాలు.. మీరు నన్ను ఇంటి దాకా తీసుకొస్తారు. చెబితే పోలా? నేను మీ భార్యనని చెబితే నన్ను కన్నతల్లిలానే చూస్తుంది. మన కథ సుఖాంతం అవుతుంది. చెబితే పోలా అని అనుకుంటే మీ పరిస్థితి ఏంటీ? మీ భార్యనని నా నోటితో నేను హిమకు చెప్పను. దాని వల్ల మీరు నన్ను ఈ ఇంటికి తీసుకురాగలరు కానీ.. మీ మనసులోకి ఎప్పటికీ రానివ్వరు. నాకు కావాల్సింది… మీ మనసులో చోటు’ అంటుంది దీప కార్తీక్ వైపు ప్రేమగా చూస్తూ..

మీరూ పాల్గొనండి..

‘చూడు..’ అంటూ కార్తీక్ ఏదో చెప్పబోతాడు. ‘ఆగండి. మీరు ఏం చెబుతారో నాకు తెలుసు.. హిమని అడ్డుపెట్టుకుని నాతో ఆడుకోకు అని చెబుతారు. హిమకు తెలిస్తే ఇంటికి వచ్చే అవకాశాన్నే వదులుకున్నదాన్ని. ఇక హిమని అడ్డుపెట్టుకుని మీతో ఏం ఆడుకుంటాను? రండి. ఇంట్లో అందరి కోసం అన్ని చేశాను. మీరు నాకు విడాకులు ఇవ్వట్లేదని చెప్పడంతో అందరికీ పార్టీ ఇస్తున్నాను. మీరూ పాల్గొనండి’ అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కార్తీక్ ఆవేశంగా అక్కడున్న మొక్క ఆకులని పీకి విసిరేస్తాడు.

మౌనిత ఊహలు..

ఉదయం మౌనిత కూల్‌గా పేపర్ చూసుకుంటూ ఉంటుంది. రాశిఫలాలు చెక్ చేస్తుంది. ప్రియమణి వచ్చి మాట్లాడటంతో.. ‘కార్తీక్‌కి విడాకులు రావడం, సౌందర్య ఆంటీ ఏడవటం, ఆ దీప తండ్రి మురళీ కృష్ణ.. అమ్మా దీపా అంటూ పిలిచే ఆ మిడిల్ క్లాస్ తండ్రి మళ్లీ మందుకు బానిస కావడం.. ఇవన్నీ పోను.. 15 రోజుల్లో కార్తీక్ ఫ్రీ అయిపోతాడు. అప్పుడు మా పెళ్లికి మంచి రోజు వస్తుంది. అప్పుడు నీకు పార్టీ ఇస్తాను ప్రియమణీ’ అంటూ సంబరంగా చెబుతుంది మౌనిత.

ఎలా వెయిట్ చెయ్యాలో?

ప్రియమణితో మౌనిత.. ‘ఆ మంచిరోజు దాకా ఎలా వెయిట్ చెయ్యాలో ఏంటో?’ అని అంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ గుమ్మం దగ్గర నిలబడి ‘ఏం మంచిరోజు?’ అంటాడు. షాక్ అయిన మౌనిత మాట మార్చి.. ‘రా కార్తీక్.. కూర్చో.. ఏమైంది కార్తీక్ అలా ఉన్నావేంటీ?’ అంటూ ఆరా తీస్తుంది. ప్రియమణి కాఫీ తేవడానికి వెళ్లి వచ్చేలోపు.. కార్తీక్ జరిగిన విషయం చెప్పేస్తాడు.

హిమకు అబద్దం చెప్పిన కార్తీక్..

ఇంతలో హిమా కాల్ చేస్తుంది. ‘హలో డాడీ..’ అంటుంది హిమ. కార్తీక్ కంగారుపడుతూ.. ‘హిమా ఏంట్రా?’ అంటాడు. ‘ఎక్కడున్నావ్ డాడీ..’ అన్న హిమ ప్రశ్నకు.. ‘నేనా.. నేను అర్జెంట్ కేసు ఉంటే చూడటానికి వచ్చాను. వచ్చేస్తాను..’ అని అబద్దం చెబుతాడు కార్తీక్. ఫోన్ పెట్టేసిన తర్వాత.. ‘టీ చల్లారిపోయింది మౌనిత.. హిమ రమ్మంటోంది. వెళ్తున్నాను.’ అంటూ బయలుదేరతాడు.

కార్తీక్‌కి మౌనిత వార్నింగ్..

చైర్‌లోంచి లేచి కాస్త దూరం వెళ్లిన కార్తీక్‌ని.. ‘కార్తీక్…’ అని గట్టిగా పిలుస్తుంది మౌనిత. ‘నువ్వు ఇక్కడున్నప్పుడు మీ వాళ్లు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగితే మౌనిత ఇంట్లో ఉన్నానని చెప్పగలిగిన రోజే నువ్వు ఇక్కడికి రా కార్తీక్. అంత వరకూ రావాల్సిన అవసరం లేదు. ఇక వెళ్లు కార్తీక్.’ అంటుంది మౌనిత ఆవేశంగా.. కార్తీక్ ఆ మాటలకు కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

చక్కెర పొంగలి చేస్తా!

హిమ కారణంగా విడాకులు ఆగిపోవడంతో.. ‘కన్నకూతురు కారణంగా నాకు ఇంత మంచి జరిగింది’ అనుకుంటూ దీప దేవుడికి దన్నం పెట్టుకుని సంబరపడిపోతుంది. సౌర్యని పిలిచి.. ‘ఎండుకొబ్బరి ముక్కలు ఉంటాయి ఆ ఇంట్లో తీసుకుని రా చక్కెర పొంగలి చేస్తాను’ అంటుంది. ‘ఏంటో ఈ రోజు వంటలక్క చాలా సంతోషంగా ఉంది.. అసలు ఆ డాక్టర్ బాబు, ఈ వంటలక్క ఎప్పుడు కలుస్తారో ఏంటో’ అంటూ సౌర్య అనుకుంటూ కొబ్బరి ముక్కలు తెస్తుంది. అంతా పొయ్యి మీద పెట్టి.. స్టవ్ వెలిగిస్తే.. గ్యాస్ అయిపోయి ఉంటుంది.

సారీ అత్తమ్మా..

గ్యాస్ అయిపోవడంతో.. దీప చిన్న పిల్లలా సౌర్య వైపు కొంటెగా చూస్తూ, నవ్వుతూ.. ‘గ్యాస్ ఇల్లే.. గ్యాస్ అయిపోయింది.. వంటలక్క ముఖానికి చక్కెర పొంగలి ఒకటి.. అనవసరంగా నీకు ఆశపెట్టాను పాపిస్టిదాన్ని’ అంటుంది దీప. ఆ మాటలకు సౌర్య.. దీపని పట్టుకుని ‘అమ్మా బాధపడుకు. నువ్వు హ్యాపీగా ఉన్నావ్‌గా అది చాలు’ అంటుంది. ఇంతలో మురళీ కృష్ణ.. ఓ బాక్స్ తీసుకుని ‘అమ్మా దీపా’ అంటూ వస్తాడు. ఆ పిలుపుకి పరుగున వెళ్లిన దీప.. ‘నాన్నా.. అని పిలవాలో లేదో.. సౌర్యకు నిజం తెలియాలో లేదో అన్న అనుమానంతో.. నా..’ అంటూ ఆగిపోతుంది.