Karthika Deepam Serial 31st January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 718 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 719 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 31) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో ముందుగానే మీకోసం.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

చీకటి పడిన తర్వాత.. సౌందర్య బాధతో సౌర్య మాటలు తలుచుకుంటూ.. పైన అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఆనందరావు వచ్చి.. ‘సౌందర్య.. ఇప్పుడు వాడ్ని ఏం అనకు. వాడు తిరిగి మాట్లాడుతుంటే.. మన పెద్దరికం పోతుంది.’ అంటాడు. కార్తీక్ కారు సౌండ్ వినిపిస్తుంది. ‘ఏం కాదులేండీ.. మనకింకా పెద్దరికం ఎక్కడుంది?’ అంటూనే కార్తీక్‌కి ఫోన్ చేసి.. ‘పైకి రారా ఒకసారి’ అంటుంది కిందకి చూస్తూ. కార్తీక్ ఫోన్ పెట్టేసి.. ‘అయిపోయింది. తెలుగు తిట్లు వినసొంపుగా వినాల్సిందే’ అనుకుంటూ పైకి నడుస్తాడు కూల్‌గా..

పదండి లోపలికి..

కార్తీక్ నడిచి వస్తుంటే సౌందర్యకు సౌర్య మాటలే గుర్తుకొస్తుంటాయి. ‘నువ్వు ఏం అవుతావని.. ఆ డాక్టర్ అడుగుతుంటే.. వీళ్లందరూ నోరు తెరిచి నువ్వు ఏం అవుతావో చెప్పలేదమ్మా?’ అని సౌర్య దీపని వాళ్ల ముందే నిలదియ్యడం గుర్తుకొచ్చి బాధతో చూస్తూ ఉంటుంది. ‘ఏంటీ మీరు పెద్ద యూత్ అనుకుంటున్నారా? ఈ చలిలో ఏంటీ? పదండి లోపలికి’ అంటాడు కార్తీక్ కాస్త కఠినంగా సౌందర్య ఆనందరావులని చూస్తూ..

హిమ ఏమైనా అందా?

‘అసలు ఈ కొంపలో ఉండేది ఐదుగురే అయినా కలిసి మనస్పూర్తిగా మాట్లాడుకోలేని దౌర్భాగ్యపరిస్థితి..’ అంటూ స్టార్ చేసిన సౌందర్యతో.. కార్తీక్ కోపంగా.. ‘అసలు ఈ పంచాయితీ పెట్టాల్సిన పరిస్థితేం వచ్చింది?’ అంటాడు. ‘వచ్చింది.. పసితనం(సౌర్య) ప్రశ్నలకి అవాక్ అయిపోయి నిలబడాల్సిన రోజు వచ్చింది’ అంటూ రగిలిపోతుంది సౌందర్య. ‘హిమా ఏమైనా అందా?’ అంటాడు కార్తీక్ అర్థం కానట్లుగా..

నువ్వేం చెయ్యగలవ్?

‘రేయ్ కార్తీక్ అబద్దాలు ఆడకురా.. దీప అలా చెప్పుకుని ఎప్పుడు తిరిగిందిరా.. ఇక నుంచి మేమే మాకు తెలిసిన వాళ్లందరికీ, మేము తెలిసిన వాళ్లకీ దీపే మా పెద్ద కోడలు అని ప్రచారం చేసి వస్తాం.. అప్పుడు నువ్వేం చెయ్యగలవ్’ అంటాడు ఆనందరావు ఆవేశంగా.. సౌందర్య కూడా ఆనందరావు మాటలకి సమర్దిస్తుంది.

నిజమే ఆమె ఎవరు?

‘హిమా కాదు. ఆ డాక్టర్ రిజ్వానా.. ఈమె ఎవరు అని దీపని నిలదీస్తే.. నా పెద్ద కోడలు అని చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చావ్?’ అంటుంది సౌందర్య కోపంగా.. ‘నిజమే ఆమె ఎవరు?’ అంటూడు కార్తీక్ వెటకారంగా.. ‘ఆమె ఎవరు అని నువ్వు విడాకులు ఇవ్వాలనుకున్నావ్?’ అంటుంది సౌందర్య రివర్స్‌లో.. ‘ఆమె నా భార్యనని ఊరంతా చెప్పుకుని తిరుగుతుంటే విడాకులు ఇవ్వాలనుకున్నాను’ అంటాడు కార్తీక్.

కార్తీక్ ఆవేశం..

వెంటనే కార్తీక్ ఆవేశంగా సౌందర్య, ఆనందరావులకి దన్నంపెట్టి.. ‘ఆపుతారా ఆ వంటలక్క దండకం.. ఇంటికి వారసుడు పుట్టాడు. తమ్ముడు తండ్రి అయ్యాడు.. ఈ ఆనందం లేదు.. ఎప్పుడు చూసినా ఆ వంటలక్క ఆలోచనలే. మీరు ఏమైనా చేసుకోండి. ఆ దీపని, దాని కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని చరిత్రకి ఎక్కండి.’ అంటాడు. సౌందర్య ఆనందరావు షాక్ అవుతారు.

అమెరికా వెళ్లిపోతా..

కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. ‘కానీ.. ఒకటి మాత్రం నిజం. ఆ చరిత్రలో కార్తీక్ అనే పేరు కానీ, డాక్టర్ బాబు అనే పేరు కానీ ఉండవు. అమెరికాలో రీసర్చ్ డాక్టర్‌గా నా పేరు ఉంటుంది(అమెరికా వెళ్లిపోతా)’ అంటూ బెదిరించి వెళ్లిపోతాడు. దాంతో సౌందర్య ఏడుస్తూ పట్టుతప్పి పడిపోబోతుంది. ఆనందరావు పట్టుకుని గుండెలకు హత్తుకుని ఓదారుస్తాడు. ఆ సీన్ ప్రేక్షకుల గుండెలను పించేస్తుంది.

ఏంటీ అలా కూర్చున్నావ్?

దీప.. చీర కొంగు కప్పుకుని ధీనంగా, బాధగా కుర్చీలో కూర్చుంటుంది. సౌర్య డౌట్‌గా చూస్తూ ‘ఏమైంది? ఏంటీ అలా కూర్చున్నావ్? వంట చెయ్యకుండా కూర్చున్నావ్’ అంటుంది. ‘వంట్లో బాలేదు అత్తమ్మా.. జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తోంది’ అంటుంది దీప ముఖం చాలా పేలవంగా పెట్టి. ‘అయ్యో ఎలా అమ్మా?’ అంటూ కంగారు పడుతుంది సౌర్య.

వంటలక్కా మజాకా?

‘ఏం కాదులెమ్మా సరోజక్కని సాయం రమ్మన్నాను. వంట చేస్తుంది’ అని చెప్పి.. కాస్త ఓరగా చూస్తూ.. ‘నాకు ఏ జబ్బు లేదు అత్తమ్మా.. శ్రావ్య పిన్ని పురిటి స్నానానికి వెళ్తున్నా అంటే నానా ప్రశ్నలతో నన్ను చంపేస్తావ్ అని ఇలా అబద్దం చెబుతున్నాను. సారీ అత్తమ్మా’ అని మనసులో అనుకుంటూ కూల్‌గా చూస్తుంది. ఆ సీన్‌లో సౌర్య కంగారు పడుతుంటే.. మన వంటలక్క కొంటె నటన అంతా బయటపెడుతుంది. ఆ సీన్ ప్రేక్షకులకు అహ్లాదాన్ని కలిగించక మానదు.

కోడ్ భాష అదుర్స్..

హిమ కింద హాల్లో కూర్చుని.. బొమ్మ వేస్తూ ఉంటుంది. పక్క సోపాలో కూర్చున్న సౌందర్య, ఆనందరావులు.. ‘ఆకాశం ఎర్రగా ఉందా? సూర్యుడు(కార్తీక్) కిందికి దిగాడా? ఈ నక్షత్రం(హిమ) ఏంటీ ఇక్కడుందీ’ అంటూ వాళ్ల కోడ్ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కార్తీక్ కిందకి వచ్చి హిమతో నవ్వుతూ మాట్లాడటం చూసి.. ‘సూర్యుడు చంద్రుడిలా మారిపోయాడు..’ అనుకుంటూ గొనుక్కుంటారు.

తమ్ముడు పుట్టాడుగా..

అది చూసిన కార్తీక్.. హిమతో ‘వీళ్లేం మాట్లాడుకుంటున్నారు?’ అంటాడు. ‘ఏమో డాడీ నాకు అర్థంకావట్లేదు.. ఇందాకటి నుంచి అలానే మాట్లాడుకుంటున్నారు’ అంటుంది హిమ. ‘అయినా వీళ్లు మన పార్టీ కాదుకదా’ అంటూ చురకలు వేస్తూ కార్తీక్ హిమ పక్కనే కూర్చుని.. ‘ఏం చేస్తున్నావమ్మా?’ అంటాడు. ‘తమ్ముడు పుట్టాడుగా.. వాడి బొమ్మ వేస్తున్నాను డాడీ. పేరు కూడా పెట్టేసుకున్నాను.. దీపూ’ అంటుంది నవ్వుతూ. కార్తీక్ కాలిపోతుంది.

మాలతీ పాయం తేవే..

పక్కనే ఉన్న సౌందర్య, ఆనందరావుల ముఖంలోకి నవ్వు వస్తుంది. ఆ సీన్ ఫుల్ కామెడీ ఉంటుంది. కార్తీక్ చాలా రకాలుగా చెప్పి.. పేరు మార్పించడానికి ప్రయత్నిస్తుంటే.. సౌందర్య మాత్రం చాలా హ్యాపీగా.. ‘మాలతీ పాయం తేవే..’ అంటూ హడావుడి చేస్తుంది. ‘తెస్తున్నా అమ్మా.. తయారు చేస్తున్నా’ అంటుంది మాలతీ. కార్తీక్‌కి వ్యతిరేకంగా హిమ నోట వచ్చిన ప్రతి మాటని రిపీట్ చేస్తూ చాలా హంగామా చేస్తుంది. ఆనందరావు కూడా చాలా హ్యాపీగా హిమని ఎంక్రేజ్ చేస్తాడు.

సౌందర్య హంగామా..

‘అమ్మ పేరు దీపా, అమ్మలా చూసుకునే వంటలక్క పేరు కూడా దీపే కదా.. అందుకే ఈ పేరు పెట్టాను డాడీ’ అన్న హిమను సౌందర్య మెచ్చుకుంటూ.. ‘అవునా.. మన వంటలక్క పేరు నా పెద్ద కోడలు పేరు ఒక్కటేనా?’ అంటూ కార్తీక్‌ని పట్టించుకోకుండా నవ్వుకుంటుంది. కార్తీక్ సీరియస్‌గా చూసే సరికి కాస్త కూల్ అయినా మళ్లీ అదే ఆనందంతో ‘మాలతీ పాయం తేవే’ అంటూ అరుస్తుంది. ఆ సీన్‌లో మన సౌందర్య గారి నటన అద్భుతం అనే చెప్పుకోవాలి.

కలిసే వెళ్దాంలే..

సౌందర్య, ఆనందరావుల ఆనందాన్ని చూస్తూ… హిమ పేరు మార్చడానికి సిద్ధంగా లేకపోవడంతో.. ఆవేశం అక్కడ నుంచి లేస్తాడు. ‘నేను బాబుని చూడటానికి రావట్లేదు.. మీరు వెళ్లండీ’ అని వెళ్లిపోతాడు. హిమ కాస్త నొచ్చుకుంటుంది. సౌందర్య, ఆనందరావులు మాత్రం హిమ పక్కకు వచ్చి.. సంబరపడిపోతారు. ‘ఏం బాధపడకు.. అందరం కలిసే వెళ్దాంలే’ అంటుంది సౌందర్య హిమతో.. అయితే శ్రావ్యని, బాబుని చూడటానికి ఇటు దీప, అటు కార్తీక్ ఫ్యామిలీ రాబోతుండటంతో కథ మరింత ఆసక్తిగా మారనుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.