Karthika Deepam Serial 4th February Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 721 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 722 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (ఫ్రిబవరి 4) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

శ్రావ్య ఇంట్లో పురిటిస్నానం, ఫంక్షన్‌ జరుగుతూ ఉంటుంది. దానికి సౌందర్య ఫ్యామిలీతో పాటూ దీప వస్తుంది. దీప సౌర్యకు అబద్దం చెప్పి వస్తుంది. హిమ కూడా స్కూల్‌కి వెళ్తుందిలే అనుకుంటే.. హిమ కూడా ఆ ఫంక్షన్‌కి వస్తుంది. దాంతో హిమ సౌర్యకు చెబుతుందేమోనని దీప భయపడుతుంది. ఇక హిమకు వంటలక్క పేరు, తన తల్లి పేరు ఒక్కటేనని అది దీప అని తెలిసిందన్న విషయం దీపకు తెలిసి సౌందర్యతో తన భయాలను పంచుకుంటుంది. సౌందర్య సర్దిచెబుతుంది.

హ్యాపీ మూమెంట్…

శ్రావ్య, దీప ఇద్దరూ.. కలిపి నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘ఎందుకక్కా? సౌర్యని తీసుకుని రాలేదు?’ అంటుంది శ్రావ్య దీపతో.. ‘అమ్మో అసలు సౌర్యకు అబద్దం చెప్పి వచ్చాను’ అంటుంది దీప హాస్పిటల్‌లో చేసిన రచ్చ గుర్తు చేస్తూ.. ‘అవునక్కా అత్తయ్యగారు కూడా మాట్లాడలేకపోయారటగా? తెలిసింది’ అంటుంది శ్రావ్య. ‘సౌర్య చేష్టలు గురించి, అది వేసే బాంబులాంటి ప్రశ్నల గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.

చాటుగా వింటూ..

అందంతా చూస్తూ.. సంబరపడిపోతూ కూతుర్లను చూసుకుంటూ అక్కడికి వచ్చాడు మురళీ కృష్ణ. అప్పటికే హిమకు డౌట్ వచ్చి పక్కకు ఆగి వాళ్ల మాటలు వింటుంది ‘వంటలక్కని శ్రావ్య పిన్ని అక్కా అంటుందేంటీ?’ అనుకుంటూ చాటుగా ఆగి వింటుంది. ‘అమ్మా.. మీరు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలమ్మా..’ అంటూ సంబరంగా చూస్తూ అంటాడు మురళీ కృష్ణ. వెంటనే దీప వైపు తిరిగి.. ‘దీపా నీ రక్తం పంచి ఇవాళ వాళ్లిద్దర్నీ(శ్రావ్య, బాబు) క్షేమంగా ఉండేలా చేశావ్’ అంటాడు.

హిమ షాక్…

వెంటనే దీప.. ‘రక్తం పంచింది నేను కాదు.. నువ్వు. మా ఇద్దరికీ నీ రక్తం పంచి జన్మనిచ్చావ్. నీ రక్తం పంచుకుని పుట్టిన అక్కా చెల్లెల్లం మేము’ అంటూ మురళీ కృష్ణ హగ్ చేసుకుంటుంది. వెంటనే శ్రావ్య దీపతో.. ‘అక్కా నేను నీకు చాలా రుణపడిపోయాను’ అని చెప్పడం, మురళీ కృష్ణ ఇద్దరు కూతుర్లని నాన్న అంటూ పట్టుకోవడం, అందంతా హిమ విని, చూసి షాక్ అవుతుంది.

మౌనిత హైరానా..

మౌనిత తనలో తనే బాధపడుతూ ఉంటే ప్రియమణి వచ్చి ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది. అయితే మౌనిత విషయం చెప్పకుండా నువ్వు వెళ్తావా నన్ను వెళ్లమంటావా?’ అనేసరికి ప్రియమణి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ‘హిమకు వంటలక్క పేరు, తన తల్లి పేరు దీపే అని తెలిసింది’ అంటూ కార్తీక్ చెప్పిన మాటలనే తలుచుకుంటూ టెన్షన్ పడుతుంది మౌనిత.

వంటలక్క నాకు పెద్దమ్మా..

హిమ ఓ పక్కకు వెళ్లి సంబరపడిపోతూ.. ‘అంటే వంటలక్క మాకు చుట్టాలేనా? అసలు ఈ విషయం తెలినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి నాకు ఎవరు ఎందుకు చెప్పలేదు ఈ నిజం? శ్రావ్య పిన్ని నాకు పిన్ని అవుతుంది కాబట్టి.. వంటలక్క నాకు పెద్దమ్మా.. అంతుందా? ఇక్కడ నుంచి వంటలక్కని పెద్దమ్మా అని పిలుస్తాను’ అనుకుంటూ దీప దగ్గరకు బయలుదేరుతుంది.

ఏం అన్నావ్ నా కోడల్ని?

ఇంతలో దీపని భాగ్యం చూసి.. ‘శుభకార్యానికి వస్తూ.. ఆ బోసిమెడ ఏంటే?’ అంటూ అవమానించడంతో దీప కళ్లనీళ్లు పెట్టుకుంటుంది. ‘ఇప్పుడు నేనేం అన్నానని శుభకార్యం జరిగే చోట కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్?’ అంటూ నోటికి వచ్చినట్లు వాగుతుంది. హిమ అటుగానే నడిచి వస్తుంటే.. ఇక్కడ రచ్చ పెద్దదిగా అయిపోతుంది. భాగ్యం మాటలు విన్న సౌందర్య కోపంతో.. ‘ఏం అన్నావ్ నా కోడల్ని? ఏం అనుకుంటున్నావ్ నా కోడలి గురించి?’ అంటూ అరుస్తుంది.

నిన్ను శ్రావ్య పిన్ని పిలుస్తోంది

ఇంతలో హిమ అటుగా రావడం చూసిన సౌందర్య షాక్ అవ్వగా.. మురళీ కృష్ణ.. ‘అమ్మా హిమా..’ అంటూ ‘నిన్ను శ్రావ్య పిన్ని పిలుస్తోంది’ అంటూ అబద్దం చెప్పి శ్రావ్య దగ్గరకు లాక్కెలతాడు. హిమకు అర్థం కాకుండా… ‘అక్కడ మీ అమ్మకు మీ అత్తగారు ఇంత పెద్ద గడ్డి పెడుతున్నారు.. అంతా అక్కడే ఉన్నారు.. నువ్వు పిలిచావ్ కదా.. తీసుకొచ్చాను’ అనడంతో శ్రావ్య అర్థం చేసుకుని హిమని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. మురళీ కృష్ణ కూడా పక్కనే కూర్చుంటాడు.

మీరంతా ఎప్పుడూ నిజాలే చెప్పరు..

దాంతో హిమ.. శ్రావ్య, మురళీ కృష్ణలనే నిలదీస్తుంది. ‘మీరంతా ఎప్పుడూ నిజాలే చెప్పరు.. వంటలక్క నీకు సొంత అక్కే కదా? ఎందుకు చెప్పలేదు?’ అంటూ ప్రశ్నించడంతో శ్రావ్య, మురళీ కృష్ణలు షాక్ అవుతారు. మురళీ కృష్ణకి కార్తీక్ ఇచ్చిన వార్నింగ్ గుర్తుకొచ్చి.. మరింత కంగారు పడతాడు. అయితే హిమ మాత్రం ఆపదు.. ప్రశ్నిస్తూనే ఉంటుంది. ‘వంటలక్కే మీ అక్క అని నాన్నమ్మ ఎందుకు చెప్పలేదు? మీ సొంత అక్కే కదా? నువ్వెందుకు చెప్పలేదు? ఎవ్వరూ ఎందుకు నిజాలు చెప్పడంలేదు?’ అంటుంది హిమ. ఆ ప్రశ్నలకు మురళీ కృష్ణ షాక్‌తో పైకి లేచి నిలబడతాడు.

అతను ఎప్పటికీ రాడా?

‘సౌర్య వాళ్ల నాన్న గురించి కూడా మీకు తెలుసే ఉండాలిగా? మరి మీరు ఎప్పుడు సౌర్య వాళ్ల నాన్న గురించి చెప్పలేదెందుకు? సౌర్య వాళ్ల నాన్న ఎందుకు మాట్లాడరు? అతను ఎప్పటికీ రాడా? వంటలక్క ఒక్కర్తే ఉండాలా? ఎందుకు మీరంతా ఉండగా వేరే ఉండాలి..?’అంటూ అడుగుతూనే ఉంటుంది. దీప తండ్రి మురళీ కృష్ణ అని, చెల్లెలు శ్రావ్య అని తెలుసుకున్న హిమ.. సౌర్యతో చెబుతుందో? సౌందర్యని అడుగుతుందో? కార్తీక్‌ని నిలదీస్తుందో? వేచి చూడాలి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.