Karthika Deepam Serial 6th January Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 696 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 697 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 6) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…
దీప ధీనంగా సౌందర్య పక్కనే కింద కూర్చుని.. ‘మీ సుపుత్రుడు విడాకుల ఆహ్వానపత్రం పంపించాడు అత్తయ్యా’ అంటూ బాగా ఏడుస్తుంది. బాధపడొద్దని సౌందర్య దీపని ఓదార్చిన తర్వాత సౌర్య వచ్చి.. ‘చూశారా నోటీసులు.. ఇవి వచ్చినప్పటి నుంచి అమ్మ ఏడుస్తూనే ఉంది తెలుసా నాన్నమ్మా’ అంటుంది బాధగా.. ఇద్దరూ బాగా ఏడుస్తుండటంతో.. ‘మీరు బాధపడకుండా నేను చేస్తాను. కార్తీక్ విడాకుల మాట ఎత్తకుండా నేను చేస్తాను’ అంటుంది ధీమాగా.. దాంతో వాళ్లు ఏడవటం ఆపుతారు. అయితే సౌందర్య మనసులో.. ‘నేను వీళ్లకి ధైర్యం ఇస్తున్నాను కానీ నాకు ధైర్యం ఇచ్చేదెవరు? నేను చూసుకుంటానని.. మాటిచ్చాను గానీ.. ఇప్పుడు వాడ్ని ఎలా ఆపాలి?’ అనుకుంటూ టెన్షన్ పడుతుంది.

బాధను నటిస్తోన్న మౌనిత

ఏదో కోల్పియినట్లు.. సర్వం పోయినట్లు.. దుఖంలో ఉన్న మనిషి కూర్చునట్లుగా కూర్చున్న మౌనితని ప్రియమణి వచ్చి పలకరిస్తుంది. ‘ఏమైందమ్మా అంత దీనంగా కూర్చున్నారు? దీప కొట్టిందా? కార్తీక్ అయ్య తిట్టాడా?’ అంటూ ఆరా తీస్తుంది. అయితే మౌనిత మాత్రం అస్సలు నవ్వుకుండా.. ‘ఏం కాలేదే.. దీప నోటీసులు అందుకుంది..’ అని చెప్పడంతో ప్రియమణి చాలా సంతోషంగా.. ‘ఈ విషయం ఇలా బాధగా చెబుతారేంటమ్మా?’ అంటుంది షాక్‌గా.

పాలైనా తాగండమ్మా

‘దేవుడు నా ఆనందాన్ని ఓర్వలేడు ప్రియమణి. నువ్వు ఆ డ్రైవర్ గాడు.. వెళ్లి పెద్ద హోటల్‌లో తినేసి రండీ. నేను మాత్రం పచ్చి మంచినీళ్లు కూడా తాగను. ఈ సారైనా ఈ సెంట్‌మెంట్ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం’ అంటూ బాధతోనే చెబుతుంది. మొదట ప్రియమణి ‘కాస్త పాలైనా తాగండమ్మా’ అని బతిమలాడినా ‘అమ్మో నేను ఆనందంగా ఉండనే..’ అంటూ వినకపోయేసరికి.. ప్రియమణి డ్రైవర్‌తో కలిసి తినడానికి వెళ్తుంది.

నాన్నే గుర్తొస్తున్నారమ్మా

సౌర్య ఏదో ఆలోచిస్తూ పుస్తకం మీద పిచ్చి గీతలు పెడుతూ ఉంటుంది. అది చూసిన దీప కోపంతో.. ‘అత్తమ్మా ఏంటది ఏం రాస్తున్నావ్?’ అని అరుస్తుంది దీప. ‘పరీక్షల్లో కూడా ఇలానే గీతలు తీశావా? కలెక్టర్ అవుతానని మాటిచ్చావ్? క్లాస్‌లో కూడా ఇంత పరధ్యానంగా ఉంటున్నావా? అందుకే మార్కులు తక్కువ వస్తున్నాయా?’ అంటూ తిడుతుంది. ‘నేను బుక్ తెరిస్తే చాలమ్మా నాన్నే గుర్తుకొస్తున్నారు’ అంటూ బాధగా చెబుతుంది సౌర్య.
కోపంగా లేదా అమ్మా

‘ఆ నాన్నేగా నిన్ను చదివిస్తున్నది? ఆయనే కదా నువ్వు బాగా చదువుతావని నమ్మారు.? కానీ నువ్వు మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నావ్. నువ్వు చదవట్లేదని తెలిస్తే నాన్న బాధపడరా?’ అంటుంది దీప కోపంగా సౌర్యతో. ‘నాన్న బాధపడతాడని నువ్వు బాధపడుతున్నావ్.. కానీ నువ్వు బాధపడుతుంటే మాత్రం నాన్న ఇంకా ఇంకా నిన్ను బాధపెడుతూనే ఉన్నాడు. నీకు నాన్న విడాకులు ఇస్తానన్నాడని కోపంగా లేదా అమ్మా?’ అని అడుగుతుంది సౌర్య.

వినలేదుగా నాన్న

‘ఆ విషయాలన్నీ నాన్నమ్మ చూసుకుంటానని చెప్పింది కదా? నువ్వు ఎందుకు వాటి గురించి ఆలోచిస్తున్నావ్?’ అంటుంది దీప బాధగా. ‘ఎనిమిదేళ్లుగా నాన్నమ్మ నాన్నకు ఏం చెప్పట్లేదా? మరి నాన్న ఎందుకు మారలేదు? మొన్నే మన ఇంట్లో తినమంటే నాన్నమ్మ మాట కూడా వినలేదుగా నాన్నా?’ అంటుంది సౌర్య బాధతో..
‘ఇది నా తల రాతమ్మా.. ఆ దేవుడు రాసిన రాతలు ఆయనకి కూడా అర్థం కాక.. ఇలా నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు’ అంటూ ఏడుస్తుంది దీప. సౌర్య కూడా దీపని పట్టుకుని ఏడుస్తుంది.

భాగ్యానికి సంబరం

ఫోన్‌లో మాట్లాడి పెట్టిన వెంటనే.. ‘భలే ఛాన్స్‌లే.. లక్కీ ఛాన్స్‌లే..’ అంటూ పాడుతూ ఉంటుంది భాగ్యం. ‘ఏమైందమ్మా?’ అని శ్రావ్య అడగగానే.. ‘దీపకు విడాకులు రాబోతున్నాయే.. మౌనిత చెప్పింది. మీ బావ దీపకు పంపించాడట. రెండో సారి కూడా తెగించి పెంపాడంటే.. ఈ సారి కచ్చితంగా విడాకులు వచ్చేస్తాయి..’ అంటూ సంబరపడిపోతుంది. శ్రావ్య షాక్ అవుతుంది. వెంటనే.. భాగ్యాన్ని బుద్ది చెప్పాలని ‘మా అత్తగారు ఇక్కడికి వస్తున్నారట’ అంటూ అబద్దం చెప్పి వెళ్లిపోతుంది శ్రావ్య. వెంటనే భాగ్యం గుండె పట్టుకుంటుంది.

స్కూల్‌కి రా డాడీ

‘ఇవాళ హాస్పెటల్‌కి వెళ్లాలా? మధ్యాహ్నం ఖాళీగా ఉంటావా? స్కూల్‌కి రా డాడీ.. నీకో ఓ సర్ఫ్రైజ్..డాడీ.. మధ్యాహ్నం స్కూల్‌కి వస్తారుగా?’ అని అడుగుతుంది హిమ. ‘ఎందుకురా? ఏదైనా సర్ఫ్రైజా?’ అంటాడు కార్తీక్. ‘అవును డాడీ.. నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది’ అంటుంది నవ్వుతూ హిమ. ‘నా ప్రశ్నలోనే సమాధానం ఉందా? ఏంటది? ఏదైనా సర్ఫ్రైజా? అన్నాను.. సర్..ఫ్రైజ్.. ఫ్రైజా? దీనికి రా?’ అంటాడు కార్తీక్.

నాన్న గురించి వ్యాసం.. ఫస్ట్ ఫ్రైజ్ నాకే డాడీ

‘మొన్న నాన్న గురించి వ్యాసం రాయమన్నారు డాడీ. రాశాను. ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది.’ అంటుంది హిమ. ‘అవునా ఏం రాశావురా?’ అని అడుగుతాడు కార్తీక్. ‘అది మాత్రం సర్ఫ్రైజే డాడీ.. స్కూల్లోనే చూపిస్తాను’ అంటుంది హిమ. ‘అవునా.. సరే మరి అది రాయలేదా నాన్న గురించి?’ అని కార్తీక్ ప్రశ్నించగానే.. ‘ఎవరు డాడీ?’ అంటుంది హిమ. ‘అదే ఆ రౌడీ?’ అంటాడు కార్తీక్.

వాళ్ల డాడీ గురించి.. మనకెందుకు లేమ్మా

‘తనా.. రాయలేదు డాడీ. నాకు నాన్న లేడుగా? లేని నాన్న గురించి చూడని నాన్న గురించి నేనేం రాయను? అని చాలా బాధపడింది డాడీ’ అని చెబుతుంది హిమ. ‘అవన్నీ మనకెందుకులేమ్మా’ అంటూ మాట దాటేసే ప్రయత్నం చేసిన కార్తీక్‌తో.. హిమ కోపంగా.. ‘నువ్వు ఎప్పుడూ అంతే డాడీ.. వాళ్ల విషయం చెబితే మనకెందుకు అంటావ్. వంటలక్క మాత్రం ఎప్పుడూ అలా అనుకోదు. నువ్వు చాలా మంచివాడివి కదా? నువ్వు అలా అనకూడదు’ అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

ఆలోచనలో పడ్డ కార్తీక్.. కాస్త రిలీఫ్

హిమ వెళ్లిపోవడంతో మంచం మీద కూర్చుని తనలో తనే ఆలోచించుకుంటాడు కార్తీక్. ‘అమ్మయ్య.. ఆ రౌడీ ఎన్ని సార్లు నాన్నా నాన్న అని కలవరించినా.. దీప నిజం చెప్పకుండా నన్ను కాపాడింది. చెప్పి ఉంటే ఎక్కడ కనిపించినా నాన్నా నాన్నా అని చంపేసేది. ఆ దీపైనా భరించవచ్చు కానీ ఆ రౌడీని భరించడం చాలా కష్టం. బతికిపోయాను’ అనుకుంటాడు మనసులో..

నాన్న హిమకి అన్నీ కొంటాడు

‘రోడ్ల పక్కన తక్కువ రకం చెప్పులు కొనకమ్మా.. వెంటనే పాడవుతున్నాయి. షూస్ కూడా అలానే అవుతున్నాయి.’ అంటుంది సౌర్య ముగ్గువేసి లోపలికి వచ్చి దీపతో.. వెంటనే దీప.. సౌర్య చేతిలోని చెప్పు తీసుకుని.. తను పిన్నీసు పెడుతూ ఉంటుంది. సౌర్య మాట్లాడుతూనే ఉంటుంది. ‘హిమకైతే డాక్టర్ బాబు.. అదే నాన్న అన్ని బ్రాండ్‌వే కొంటారు. అవన్ని పాతగా అయ్యాక మాలతి(పనిమనిషి) వాళ్ల అక్క కూతురికి ఇచ్చేస్తాదట’ అంటుంది సౌర్య నవ్వుతూ. దీప ధీనంగా వింటూ ఉంటుంది.

బాధలో దీపకు గాయం..

దీప ఆవేదన!
‘హిమ పాదం నా పాదం కంటే చిన్నదమ్మా. డ్రెస్‌లు కూడా నాకు టైట్ అయిపోతాయి. లేదంటే నేను వాటిని కళ్లకు అద్దుకుని తెచ్చుకునేదాన్ని కదమ్మా’ అంటుంది సౌర్య కాస్త బాధగా ముఖం పెట్టింది. అదంతా వింటున్న దీప బాధగా ఆలోచిస్తూ.. పిన్నీస్ చేతి వేలులో చూసుకోకుండా గట్టిగా గుచ్చుకుంటుంది. రక్తం బాగా వస్తుంది. వెంటనే సౌర్య టెన్షన్‌గా క్లాత్ తెవడానికి వెళ్లింది. దీప కోపంతో, బాధతో చేతిలోని చెప్పుని విసిరికొడుతుంది. బాగా ఏడుస్తుంది. ఇంతలో సౌర్య క్లాత్ తెచ్చి దీప వేలుకి కడుతుంది.

కమింగ్ అప్‌లో.. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతోంది

‘హిమకి పాపం అన్నీ ఉన్నాయి కానీ.. అమ్మ లేదుకదమ్మా..? ఆవిడ నీకు తెలుసా అమ్మా? నువ్వు ఆమెతో మాట్లాడావా?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది సౌర్య దీపని. వరస ప్రశ్నలకు టెన్షన్‌తో దీప.. ‘వాళ్ల సంగతి మనకు ఎందుకు అత్తమ్మా?’ అంటుంది. అయితే సౌర్య కోపంగా.. ‘హా.. నిన్ను అడిగితే ఏ రోజు నిజం చెప్పావ్? నాన్న గురించి అడిగి అడిగి చివరికి నేనే నిజం తెలుసుకున్నాను. ఇప్పుడు హిమ వాళ్ల అమ్మ ఎవరో కూడా నేనే తెలుసుకుంటాను’ అంటుంది సౌర్య గట్టిగా. దీప షాక్ అవుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.