Karthika Deepam Serial 8th January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్‌ 698 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 699 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్‌ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్‌ నేటి (జనవరి రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…
శ్రావ్య’ ఆదిత్యల దగ్గర భాగ్యం హడావిడి చేస్తూ ఉంటుంది. ఇంతలో రిజ్వానా డాక్టర్‌ వచ్చి శ్రావ్యని చెక్‌ చేసి రెండు రోజుల్లో ఆస్పత్రుల్లో జాయిన్‌ చేయాల్సి ఉంటుందని చెప్పి.. వెళ్లిపోతుంది. ఆ విషయం సౌందర్యకు ఫోన్‌ చేసి చెప్పాడు ఆదిత్య. దాంతో సౌందర్య, ఆనందరావులు చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతారు.

699 ఎపిసోడ్‌ హైలెట్స్‌…
కార్తీక్‌ హిమని కారులో తీసుకుని వెళ్తుంటే.. ‘డాడీ నాకు ఎందుకు నిజం చెప్పలేదు? వంటలక్కే శ్రావ్య పిన్ని వాళ్ల అక్క కదా? అలాంటప్పుడు సౌర్య వాళ్ల డాడీ నీకు ముందే తెలిసి ఉంటుంది కదా? నువ్వు ఎందుకు నా దగ్గర నిజం దాచావ్‌?’ అని గట్టిగా అడుగుతుంది. దాంతో ఉలిక్కిపడి కారు బ్రేక్‌ వేస్తాడు కార్తీక్‌. సీన్‌ కట్‌ చేస్తే.. పక్కనే హిమ ఉండదు. అదంతా తన ఊహ. ‘నిజంగానే హిమకు.. సౌర్య తండ్రిని నేనే అని తెలిస్తే ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీళ్లేదు..’ అని నిర్ణయించుకుంటాడు.

దీప మనసులో.. ‘అత్తమ్మ నన్ను పదే పదే హిమ తల్లి ఎవరూ అని అడుగుతుంది. ఈ సమయంలో హిమ తల్లి నేనే అని తెలిస్తే ఊరుకోదు. దాంతో డాక్టర్‌ బాబు నిలదీస్తుంది. డాక్టర్‌ బాబు అనకూడని మాటలతో దాని మనసుని బాధపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు..’ అనుకుంటుంది. మౌనిత లాయర్‌ని కలిసి.. ఎలాగైనా దీప, కార్తీక్‌లకు విడాకులు వచ్చేలా చెయ్యాలని మరోసారి చెబుతుంది. అందుకు లాయర్‌ సరే అంటాడు.

సౌందర్య, ఆనందరావులు స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమవుతారు. ఇద్దరూ కూర్చుని.. ‘కార్తీక్‌ లైన్‌లోకి రావాలంటే హిమకు నిజం తెలియడమే కరెక్ట్‌ కానీ.. జాగ్రత్తగా హిమకు నిజం తెలిసేలా చెయ్యాలి’ అని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ కలిసి స్కూల్‌కి వెళ్తారు. అక్కడ సౌర్య, హిమ, వంటలక్కా ఎదురు చూస్తూ ఉంటారు. ‘అంతా కలిసి లోపలికి వెళ్లండి డాడీ కోసం నేను ఎందురు చూస్తాను’ అని చెప్పి హిమ అందరినీ లోపలికి పంపిస్తుంది.

కమింగ్‌ అప్‌లో..
కార్తీక్‌ స్కూల్‌కి వస్తాడు. హిమని ఎత్తుకుని తిప్పి చాలా హ్యాపీగా ముద్దాడతాడు. మనసులో.. ‘అమ్మయ్యా ఆ వంటలక్కా.. దాని ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ ఎవ్వరూ రాలేదు. చాలా హ్యాపీగా ఉండొచ్చు’ అని హిమని తీసుకుని లోపలికి వెళ్తాడు. హిమవైపు చూస్తూ నడుస్తూన్న కార్తీక్‌.. హిమ కూర్చోమని సీట్‌ చూపిస్తుంది. చూసుకోకుండా దీప పక్కనే కూర్చుంటాడు. తన చెయ్యి దీపకు తగలడంతో సారీ చెప్పడానికి తిరిగి చూసి షాక్‌ అవుతాడు. ఆ సీన్‌ అదిరిపోయింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.