Karthika Deepam Serial 9th January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 699 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 700 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 9) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమైన సౌందర్య, ఆనందరావులు.. ‘కార్తీక్‌ లైన్‌లోకి రావాలంటే.. హిమకు నిజం తెలియడమే కరెక్ట్‌. కానీ.. జాగ్రత్తగా హిమకు నిజం తెలిసేలా చెయ్యాలి’ అని నిర్ణయించుకుంటారు. తర్వాత ఇద్దరూ కలిసి స్కూల్‌కి వెళ్తారు. అక్కడ సౌర్య, హిమ, వంటలక్కా ఎదురు చూస్తూ ఉంటారు. ‘అంతా కలిసి లోపలికి వెళ్లండి, డాడీ కోసం నేను ఎదురు చూస్తాను’ అని చెప్పి హిమ అందరినీ లోపలికి పంపిస్తుంది.

అమ్మయ్యా ఎవ్వరూ రాలేదు!

కార్తీక్‌ స్కూల్‌కి వస్తాడు. హిమని ఎత్తుకుని తిప్పి చాలా హ్యాపీగా ముద్దాడతాడు. మనసులో.. ‘అమ్మయ్యా ఆ వంటలక్కా.. దాని ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ ఎవ్వరూ రాలేదు. చాలా హ్యాపీగా ఉండొచ్చు’ అని హిమని తీసుకుని లోపలికి వెళ్తాడు. అటూ ఇటూ చూస్తూ నడుస్తూన్న కార్తీక్‌.. హిమ కూర్చోమని సీట్‌ చూపిస్తుంది. చూసుకోకుండా దీప పక్కనే కూర్చుంటాడు.

దీప వెటకారం అదిరింది!

కార్తీక్కే తన పక్కన కూర్చుంటున్న విషయం దీపకు తెలుసు. తన చెయ్యి దీపకు తగలడంతో సారీ చెప్పడానికి తిరిగి చూసి షాక్‌ అవుతాడు. ఆ సీన్‌ అదిరిపోయింది. పైకి లేవడానికి ప్రయత్నిస్తే కూర్చో డాడీ అని హిమ ఆపుతుంది. స్కూల్‌ల్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో కార్తీక్ దీపతో నెమ్మదిగా.. ‘నువ్వెందుకొచ్చావే?’ అంటాడు. ‘క్షమించండి.. ఈ స్కూల్ మీ తాత కట్టించాడని తెలియక వచ్చాను’ అంటుంది దీప. ‘నీకు వెటకారం ఎక్కువైంది’ అంటూ కాస్త కోపంగా కార్తీక్.

నువ్వూ.. నాన్న సూపర్ అమ్మా!

దీప కార్తీక్ మాటలు పట్టించుకోకుండా నవ్వుతుంది. దీపని, కార్తీక్‌ని చూసి ఇటు హిమ, అటు సౌర్య మురిసిపోతూ ఉంటారు. కార్తీక్ చూడకుండా.. ‘నువ్వూ.. నాన్న సూపర్’ అని చేతులతో సైగ చేస్తుంది సౌర్య. ‘ఉష్..’ అంటూ సైగ చేస్తుంది దీప. మొత్తం కార్తీక్, హిమ, దీప, సౌర్యలు ఒకే చోట కూర్చోడం చూసి మురిసిపోతారు పక్క వరుసలో కూర్చున్న సౌందర్య, ఆనందరావులు. అయితే కార్తీక్ కోపంగా సౌందర్య వైపు చూడ్డంతో చూసి చూడలేనట్లుగా తల తిప్పుకుంటుంది సౌందర్య.

దేవుడా..! అంతా షాక్!

‘ఇప్పుడు వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి వచ్చి న హిమకు.. ఒక విశిష్ట అతిథిచే.. బహుమానప్రదానం జరుగుతుంది. ఆ విశిష్ట అతిథి ఒక సంఘసేవకురాలు. ఒక కారణజన్మురాలు. ఆమె పేరు వినగానే తెలిసి వాళ్లందరూ దేవత అంటారు. ఎంతో మంది స్త్రీలకు పురుడు పోనినందుకు ఆమెని సంతానలక్ష్మీ అనుకుంటారు. అలాంటి గొప్ప స్త్రీ మూర్తి ఎవరో కాదు డాక్టర్ మోనిత’ అంటూ ఆహ్వానం అందగానే ఎంట్రీ ఇస్తుంది మౌనిత. అంతా షాక్ అవుతారు.

మీరు పైకి రండి కార్తీక్

మౌనిత రాగానే.. కార్తీక్, దీప పక్కను కూర్చోడం చూసి షాక్ అవుతుంది. కార్తీక్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. స్టేజ్ మీదకు వెళ్లి నిలబడగానే.. హిమ రాసిన వ్యాసాన్ని పొగుడుతూ.. ‘ఈ వ్యాసాన్ని చదవాల్సిందిగా హిమని కోరుతున్నాం..’ అంటారు అక్కడ వాళ్లు. అక్కడికి వచ్చిన జడ్జ్ మాత్రం.. ‘నాన్న గురించి రాసిన వ్యాసం నేను చదవాను. నా మనసుకి ఎంతగానో ఆనందంగా అనిపించింది. ఈ వ్యాసం హిమ వాళ్ల డాడీ అయిన మీరు చదివితే చాలా బాగుంటుంది. పైకి రండి కార్తీక్’ అని పిలవడంతో కార్తీక్ స్టేజ్ మీదకి వెళ్తాడు.

సౌందర్య, దీపల జోక్స్..

కార్తీక్ అలా వెళ్లడంతో సౌందర్య దీప పక్కకు వచ్చి కూర్చుని.. ‘ఏంటే ఇందాక వాడే ఏదో అంటున్నాడు?’ అని అడుగుతుంది. ‘నువ్వెదుకు వచ్చావ్ అన్నారు?’ అంటుంది దీప. ‘ఏ ఈ స్కూల్ వాళ్ల తాతదటనా?’ అంటుంది సౌందర్య కోపంగా. ‘నేను అదే అన్నాను అత్తయ్యా’ అంటూ ఇద్దరూ హైఫై ఇచ్చుకుంటారు. తర్వాత సౌందర్య మాట్లాడుతూ.. ‘ఈ మౌనిత గురించి అన్ని అబద్దాలు ఈ స్కూల్ వాళ్లకి ఎవరు చెప్పారో ఏంటో?’ అంటుంది నవ్వుతూ. దీప కూడా బాగా నవ్వుతుంది. మళ్లీ వెళ్లి ఆనందరావు పక్కన కూర్చుంటుంది సౌందర్య.

సౌర్య కళ్ల నిండా నీళ్లు

‘నాన్న గురించి రాసిన మాటలను నాన్నే చదవడం నా విషయంలో జరుగుతుందేమో..’ అంటూ మురిసిపోతూ చదవడం మొదలుపెడతాడు కార్తీక్. ‘నాన్నంటే నాకు ఇష్టం. చాలా చాలా ఇష్టం. నాకు అమ్మ లేదు. కానీ అమ్మలానే చూసుకుంటాడు నాన్న. అందుకే ఇంకా ఇంకా ఇష్టం. నాన్నంటే నా అన్న మనిషంట. నాన్నమ్మ చెప్పింది. నాన్న నిద్రలేవగానే నన్నే చూస్తాడు. నిద్రపోయే ముందు నన్నే చూస్తాడు.’ అంటూ హిమ రాసిన మాటలని కార్తీక్ చదువుతుంటే.. కింద కూర్చున్న సౌర్య కళ్ల నిండా నీళ్లు తిరుగుతాయి.

హిమ చాలా గర్వంగా నవ్వుతూ..

కార్తీక్ చదువుతూ తనలో తనే పొంగిపోతూ ఉంటాడు. ఆనందభాష్పాలతో ఉబ్బితబ్బిబైపోతూ ఉంటాడు. ‘స్కూల్లో వదిలి వెళ్లినప్పుడు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు ఎందుకో నాకు కళ్లనిండా నీళ్లొస్తాయి. అందరు పిల్లలు అది కావాలి ఇది కావాలి అని నాన్నని అడుగుతారు. కానీ నాన్నా నన్ను ఏది కావాలన్నా అడిగి మరీ కొనిస్తాడు. అడగకుండానే అన్ని ఇస్తాడు.’ అంటూ చదువుతూనే ఉంటాడు. హిమ చాలా గర్వంగా నవ్వుతుంది. కింద కూర్చున్న దీప, సౌందర్య, ఆనందరావులు చాలా సంతోషంగా కళ్లనిండా నీళ్లను నింపుకుని వింటూ ఉంటారు.

సౌందర్య గమనిస్తూ..

‘వాన పడినా, ఉరపులు పడినా నాకు భయం వేయదు. అసలు నాన్నుంటే ఎందుకు భయం? సెలవులు వస్తే ఇద్దరం అడుకుంటాం. వానవస్తే.. ఇద్దరం తడుస్తూ గెంతులేస్తాం. నిద్రవస్తే నాన్న భుజం ఉంటుందిగా? నాన్న బిజీగా ఉంటాడు. అయినా స్కూల్‌కి నాన్నే అన్నం తెస్తాడు’ అంటూ కార్తీక్ చదువుతూనే ఉంటాడు. సౌర్య బాధ వర్ణతీతంగా ఉంటుంది. అది దూరం నుంచి సౌందర్య గమనిస్తూ ఉంటుంది. దీప సౌర్య కళ్లను తుడుస్తుంది. ఆ సీన్ ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టకమానదు.

భావోద్వేగంలో కార్తీక్

‘అందరికీ స్కూల్లో అమ్మలే తినిపిస్తారు. నాకు నాన్న తినిపిస్తాడు. అందరూ జలస్‌గా చూస్తారు. నేను ఫోజ్‌గా చూస్తాను. నాన్నంటే నాకు అందుకే ఇష్టం. నాకు జ్వరం వస్తే నాన్న మంచం పక్కనే కూర్చుంటాడు. నిద్రపోకుండా నన్నే చూస్తుంటాడు. ఇంట్లో అందరికీ నేనంటే ఇష్టం. కానీ ఈ ప్రపంచంలో అందరికన్నా నాన్నంటేనే నాకు ఇష్టం. ఎందుకో నాన్న గురించి రాస్తుంటే ఏడుపొస్తుంది. కాగితం తడిచిపోతుంది. ఐలవ్యూ డాడీ. ఐ లవ్యూ ఫర్ ఎవర్’ అంటూ ముగిస్తాడు కార్తీక్. వెంటనే పక్కనే ఉన్న హిమని గుండెలకు హత్తుకుంటాడు.

షాక్ ఇచ్చిన హిమ..

అదంతా చూస్తున్న మౌనిత కాస్త అసహనంగా ఫీల్ అవుతుంది. కానీ పైకి నవ్వుతూ హిమని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది. ‘ఇప్పుడు డాక్టర్ మౌనిత.. తండ్రి కార్తీక్‌ల చేతుల మీదుగా.. హిమకు బహుమతిని అందిస్తారు’ అనగానే.. ఫ్రైజ్ అందుకున్న మౌనిత.. నవ్వుతూ హిమకు ఇవ్వబోతుంది. ఇటు కార్తీక్ కూడా ఆ ఫ్రైజ్‌ని పట్టుకుని హిమకు ఇవ్వబోతాడు. అయితే హిమ మాత్రం ‘ఆగండి’ అన్నట్లు చెయ్యి చూపించి మైక్ అందుకుంటుంది.

వంటలక్క రావాలి!

‘నాకు అమ్మ లేదు. నాన్నే అన్నీ అనుకున్నాను. కానీ అమ్మ ఉంటే ఎలా చూసుకుంటుందో అచ్చం అలాగే చూసుకుంటుంది మా వంటలక్క. ఈ ప్రైజ్‌ని నాన్న, వంటలక్క ఇద్దరూ కలిసి ఇస్తే.. మా నాన్న అమ్మ కలిసి ఇచ్చినట్లేనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను’ అంటుంది హిమ. మౌనిత షాక్ అవుతుంది. కింద ఉన్న దీప, సౌందర్య, సౌర్య, ఆనందరావు అంతా సంతోషపడతారు. అంతా చప్పట్లు కొడతారు.

రగిలిపోయిన మౌనిత

‘వంటలక్క స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను’ అనగానే.. దీప పైకి వెళ్లి హిమని హగ్ చేసుకుంటుంది. ముద్దాడుతుంది. మౌనిత రగిలిపోతుంది. కార్తీక్ అయిష్టంగా చూస్తూ ఉంటాడు. దీప గర్వంగా చూస్తూ.. మౌనిత దగ్గర ఉన్న ఫ్రైజ్ ‘ఇవ్వు’ అన్నట్లుగా చెయ్యి చాపుతుంది. మౌనిత చాలా అసహనంతో దీపకు ఫ్రైజ్ అందిస్తుంది. కార్తీక్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.

కమింగ్ అప్‌లో..

సీన్ కట్ చేస్తే.. స్టేజ్ మీద ఉన్న హిమ.. పక్కనే ఉన్న కార్తీక్, దీప, మౌనిత ముందే మైక్‌లో మాట్లాడుతూ.. ‘నాకేమో అమ్మలేదు. సౌర్యకేమో నాన్న లేడు. నాన్నని బాగా చూసుకోవడానికి నాకేమో అమ్మ కావాలి. అందుకని మా డాడీకి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నేను కొత్తమ్మని చూశాను.’ అంటుంది. దీప కంగారు పడుతుంది. కార్తీక్ ఇబ్బందిగా చూస్తుంటే.. మౌనిత మాత్రం రగిలిపోతూ ఉంటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.