Karthika Deepam Serial December 17th Episode Online 2019

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 679 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 680 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 17) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

మొత్తం ఫ్యామిలీ అంతా దీప ఇంటికి చేరుకుంటారు. కార్తీక్ తప్ప అంతా చాలా ఇష్టంగా, హ్యాపీగా ఉంటారు. ఇంతలో.. ‘హిమా మీ డాడీని అడిగావా?’ అంటుంది సౌర్య. ‘అడగలేదు’ అంటుంది హిమ. ‘నేను అడుగుతానులే’ అంటూ బయలు దేరుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. కంగారు పడతారు. ఇంతలో హిమ.. ‘ఏం అడుగుతుందో మీరే విందురుగానీ’ అంటూ చాటుగా కిటిలోంచి సౌర్య, కార్తీక్‌ల మాటలు వినిపిస్తుంది హిమ. సౌర్య కార్తీక్ దగ్గరకు వెళ్లి.. ‘డాక్టర్ బాబూ వారణాసి ఉన్నాడు.. ఇంకా షాపులు మూసి ఉండరు.. ఈ ఒక్కరోజుకి మీరు కింద పడుకోండి. హిమ పైన పడుకుంటుంది(మందు తాగండి)’ అని అంటుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. అర్థం చేసుకుని కోపంతో.. ‘ఏంటే రౌడీ..? ఇంకోసారి ఇలాంటివి అడిగితే చెవి కోసి చేతిలో పెడతా’ అంటూ ఫైర్ అవుతాడు. లోపల నుంచి చాటుగా చూస్తున్న వాళ్లంతా పడిపడి నవ్వుతారు. ఆ నవ్వులు వినిపించి కార్తీక్ వాళ్లని కూడా కోపంగా చూస్తాడు. వెంటనే అటు చూనట్లేనట్లుగా బిల్డప్ కొడతారు అంతా. ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది.

హిమ తెలివి అదిరింది!

ప్రియమణి చేసిన వంటలన్నీ తనే చేసినట్లుగా బిల్డప్ కొడుతూ.. వంటలన్నింటికీ ఫొటోలు తీసుకుని.. కార్తీక్‌ని భోజనానికి రమ్మని పిలవడానికి.. వీడియో కాల్ చేస్తుంది. అయితే ఫోన్ హిమ దగ్గర ఉండటంతో.. కార్తీక్‌కి తెలియకుండా వంటలక్క దగ్గరకు వెళ్లి.. ‘వంటలక్కా.. ఆ మౌనిత కాల్ చేస్తుంది. తనతో డాడీ మాట్లాడితే.. మొన్నట్లా మధ్యలోంచే వెళ్లిపోతాడు. అందుకే నువ్వు మాట్లాడి, డాడీ రాడని చెప్పి పెట్టెయ్’ అంటుంది. దాంతో దీప మొదట సంకోచించినా.. వెంటనే.. ‘సరేమ్మా.. నువ్వు వెళ్లి సౌర్యతో ఆడుకో’ అంటూ తను ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేస్తుంది.
దీపలో చిలిపి నవ్వులు

దీప లిఫ్ట్ చేయగానే.. మౌనితకి ఫ్యూజ్లు ఎగిపోతాయి. మౌనితేమో వంటల్నీ కార్తీక్‌కి చూపించాలనే ఉద్దేశంతో.. వీడియోని.. ‘తయారు చేసిన వంటల మీద పెట్టి ఉంచుతుంది… అవన్నీ చూసిన దీప.. ‘ఏంటే అవన్నీ.. లింగు లింగు మంటూ ఒక్కదానివే ఉంటావ్ కదా? అవన్నీ ఎందుకు చేసుకున్నావ్? నీ బొంద మీద వేసుకుంటావా?’ అంటూ చిలిపిగా నవ్వుతూ అడుగుతుంది. ‘ఏయ్ నువ్వు.. నువ్వు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేశావేంటీ?’ అంటుంది మౌనిత వణుకుతున్న స్వరంతో.. వెంటనే దీప నవ్వుతూ.. ‘మా ఆయన మా ఇంటికి వచ్చాడుగా?’ అంటుంది. వెంటనే..‘నువ్వు ఫోన్ కార్తీక్‌కి ఇవ్వు.. నేను నా దగ్గరకు క్షణాల్లో రప్పించుకుంటాను’ అంటుంది మౌనిత ఆవేశంగా..
మౌనిత రోధన

‘నీ వల్ల కాదుగా.. ఎందుకంటే ఆయన్ని ఆపింది.. ఎవరో కాదు. నా కూతురు, ఆయన కూతురు’ అంటూ సౌర్య, హిమలని చూపిస్తుంది. తర్వాత.. మొత్తం కుటుంబాన్ని, కార్తీక్‌ని చూపించి.. పెద్ద షాకిచ్చి ఫోన్ పెట్టేస్తుంది దీప. దీప మాటలతో మౌనిత చేతిలోని ఫోన్ వదిలేసి.. నిస్సహాయంగా కుర్చీలో కూలబడుతుంది. సీన్ మొత్తం గుర్తు చేసుకుని చాలా ఏడుస్తుంది. కార్తీక్‌ తనకి దక్కకపోగా.. దీప ఇంట్లో భోజనం చేయడానికి ఆగిపోవడం తను జీర్ణించుకోలేక అల్లాడుతుంది.
ప్రియమణి సలహా

సీన్ కట్ చేస్తే.. ప్రియమణి వండిన వంటలకాలన్నీ నేల మీద పడి ఉంటాయి. ఓ మూలకు మౌనిత చాలా బాధగా కూర్చుని ఏడుస్తుంది. దాంతో ప్రియమణి షాక్ అయ్యి.. ‘ఏమైందమ్మా? కుక్క గానీ పాడేసిందా? అవును మీరేంటి ఇంత డీలా అయిపోయారు?’ అంటూ ఆరా తీస్తుంది. దాంతో మౌనిత ప్రియమణికి విషయం తెలియపరుస్తుంది. చాలా చేపు ‘ఊరుకోండమ్మా.. బాధపడకండి’ అని చెప్పిన ప్రియమణి.. ‘ఎంత చెప్పినా మీరు ఏడవకుండా ఆగట్లేదు కాబట్టి.. ఒకసారి మనసులో ఉన్న బాధంతా పోయేలా ఏడ్చేయండి. లైట్ ఆఫ్ చేస్తాను. మీరు ఏడ్చేయండి’ అంటూ సలహా ఇచ్చి.. లైట్ ఆఫ్ చేస్తుంది ప్రియమణి. మౌనిత చాలా గట్టిగా బావురుమంటుంది.
విషయం తెలుసుకున్న సౌందర్య

శ్రావ్య, ఆదిత్య, సౌందర్య ఓ చోట నిలబడి.. ‘ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది కదా’ అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన హిమ.. ‘ఆ మౌనితకి ఏం పనిలేదా నాన్నమ్మా? ఇందాక డాడీకి వీడియో కాల్ చేసింది. వెంటనే వంటలక్కకు ఇచ్చాను ఫోన్’అంటూ చెప్పుకొస్తుంది. విషయం తెలుసుకున్న సౌందర్య ‘మంచి పని చేశావ్’ అంటూ హిమని పొగుడుతుంది. దాంతో మనసులో.. ‘ఇక నుంచి నేను అన్నీ మంచి పనులే చేస్తాను. డాడీని వంటలక్కని కలిపేస్తాను’ అనుకుంటుంది హిమ. సౌందర్య పక్కనే ఉన్న ఆదిత్య, శ్రావ్యలు మౌనితని తలుచుకుని కోపంతో రగిలిపోతారు.
మౌనితని ఆపాల్సిందే!

‘రోజు రోజుకీ ఆ మౌనిత మరీ రెచ్చిపోతుంది మమ్మీ’ అని ఆదిత్య.. ‘అవును అత్తయ్యా.. మొన్న మీ గురించి నా దగ్గర మాట్లాడి పోయింది’ అంటూ శ్రావ్య కోపం తెచ్చుకుంటుంటే.. సౌందర్య వాళ్లని కూల్ చేస్తుంది. ‘అదంతా దాని(మౌనిత) ప్రెస్టేషన్ అంతే.. మీరు ఆ విషయం వదిలేయండి’ అంటుంది. వెంటనే శ్రావ్యతో.. ‘నెలలు నిండుతున్నాయి.. జాగ్రత్తగా ఉండు’ అంటూ సలహా ఇస్తుంది. మొత్తానికి మౌనిత మాటల నుంచి డైవర్ట్ చేసిన సౌందర్య.. వాళ్లు అలా వెళ్లగానే.. మనసులో.. ‘ఆ మౌనిత కథకు త్వరలోనే ఎండ్ కార్డ్ వేయాలి’ అనుకుంటుంది.

మరిదితో ఉంటున్నావ్!

అంతా నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. సరోజా, లక్ష్మణ్‌(సరోజ మరిది)లు.. సాయం చేస్తుంటారు. లక్ష్మణ్ పెద్ద గిన్నే పొయ్యి మీద నుంచి దించుతాడు. అది చూసి సరోజా.. ‘అయ్యో లక్ష్మణ్(హార్ట్ఎటాక్ వచ్చిన మనిషి).. బరువు ఎత్తొద్దని నీకు డాక్టర్ బాబు చెప్పారుగా’ అంటూ చెమటలు తుడుస్తుంది. సరిగ్గా అప్పుడే వచ్చిన సరోజ భర్త.. ‘సూపర్’ అంటూ వెటకారం చేస్తాడు. ‘మరిదిని డైరెక్ట్‌గా తెచ్చుకుని.. ఇంట్లోనే.. రం** సాగిస్తున్నావ్’ అంటూ నోటికొచ్చినట్లు అనుమానపు మాటలు మాట్లాడతాడు. దాంతో సరోజా ఏడుస్తూ.. ‘పెద్దోళ్ల ముందు గొడవ ఎందుకయ్యా?’ అంటూ వేడుకుంటుంది. అయినా ఆ మనిషి ఆగడు. చెడ్డ మాటలు అంటూ.. సరోజా, లక్షణ్‌లకు సంబంధం ఉన్నట్లే మాట్లాడతాడు.

కార్తీక్ ఆవేశం

సరోజ భర్త మాటలకు.. అంతా షాక్ అయ్యి చూస్తుంటే.. కార్తీక్ ‘రేయ్’అంటూ అరుస్తాడు. దగ్గరకు ఆవేశంగా వెళ్లి.. ‘ఏం వాగుతున్నావ్? సరోజక్కని అంత మాట అంటావా? దేవతలాంటి భార్యని అనుమానిస్తావా? సరోజక్క గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా?’ అంటూ కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. ‘అది కాదు బాబు.. దీని గురించి మీకు తెలియదు’ అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్న సరోజ భర్తను.. కార్తీక్ ఏ మాత్రం క్షమించడు. ‘చాలు ఆపు. పో ఇక్కడ నుంచి..’ అంటూ తోసేస్తాడు. దాంతో సరోజ భర్త.. అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

దీప ఓదార్పు

వెంటనే కార్తీక్ సరోజతో.. ‘నువ్వు బాధపడకు సరోజక్కా..’ అంటాడు. వెంటనే సరోజ కార్తీక్‌కి చేతులెత్తి దన్నం పెడుతుంది. కార్తీక్ ప్రవర్తన మొత్తం గమనిస్తున్న దీప.. తనలో తనే మురిసిపోతుంది. వెంటనే సరోజ దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. సరోజ మాత్రం బాగా ఏడుస్తుంది. ఇంతలో ఏదో కొనుక్కోవడానికి బయటికి వెళ్లిన హిమ, సౌర్యలు.. వారణాసి ఆటోలో తిరిగి వస్తారు.

సౌందర్య మమకారం

కార్తీక్ ఓ చెట్టుకుని ఆనకుని నిలడతాడు. వెనుక నుంచి వచ్చిన సౌందర్య.. ప్రేమగా కార్తీక్‌ని చూస్తూ.. ‘పెద్దోడా’ అని పిలుస్తుంది. కార్తీక్ షాకింగ్‌గా చూస్తాడు. ‘వెటకారంతో సుపుత్రా అనేవాడివి.. మమకారంతో పెద్దోడా అంటున్నావేంటీ మమ్మీ?’ అని అడుగుతాడు. దాంతో సౌందర్య.. అంతే ప్రేమగా చూస్తూ.. ‘ఈ రోజు నాకు లక్ష్మణుడి తల్లి సుమిత్ర గుర్తుకొస్తోందిరా’ అంటుంది. కార్తీక్ చూస్తూ ఉంటాడు. (బహుశా.. సరోజక్క విషయంలో ఆలోచించినట్లే దీప విషయంలో ఎందుకు ఆలోచించడంలేదు? అని అడుగుతుందేమో)

కమింగ్ అప్‌లో…

సీన్ కట్ చేస్తే.. కార్తీక్ ఫ్యామిలీ అందరూ దీప ఇంట్లో భోజనం చేస్తారు. భోజనం పూర్తి చేసిన కార్తీక్ చేయి కడుక్కుని, తుడుచుకుంటూ.. పక్కనే ఉన్న దీపతో.. ‘చూడూ నేను వచ్చి తిన్నానంటే దానికి కారణం పిల్లలు. అంతే కానీ.. నువ్వు ఏం ఆశలు పెట్టుకోకు. మూడు రోజుల్లో విడాకులు నోటీస్ వస్తుంది. నువ్వు సంతకం పెట్టకపోయినా విడాకులు వచ్చేస్తాయి’ అంటాడు. అది విన్న దీప బాధగా చూస్తూ ఉంటుంది. చాటుగా వింటున్న సౌర్య.. కార్తీక్ మాటలకు షాక్ అవుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.