Karthika Deepam Serial December 2nd Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 666 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 667 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 2) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

గతంలో దీప కొబ్బరి కాయతో దొంగను కొట్టిన రోజు సీన్ గుర్తు చేస్తూ మౌనిత కార్తీక్‌కి చురకలు వేస్తుంది. ‘ముద్దుగా మురిపంగా దాన్ని మొట్టికాయలు వేస్తూ.. దాని కూతురికి స్కూల్ ఫీజ్, టూర్ ఫీజ్ కడుతూ.. మీ అమ్మ మాట వింటూ, ఆ విడాకులకు సంబంధించి రేపు కోర్టుకు పిలిస్తే అక్కడికి వెళ్లి.. నా భార్య మహాపతివ్రత అని చెప్పుకుని, ఇంటికి తెచ్చుకుని కాపురం చేసుకో’ అంటూ రెచ్చగొట్టి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కార్తీక్ ఆలోచించి.. ‘మౌనిత చెప్పినట్లు ఇందులో నా తప్పు కూడా ఉంది. దీపకు లేని ఆశలు కలిపించింది నేనే. అలా చేసి ఉండకూడదు’ అనుకుంటూ మౌనితకి ‘తిరిగి వెనక్కి రమ్మంటూ’ కాల్ చేస్తాడు.

హిమ ఫుల్ హ్యాపీ

సౌర్యకు హిమ మీద కోపం తగ్గడంతో హిమ కోసం చాక్లెట్ కొని స్కూల్‌కి తెస్తుంది. హిమ కూడా సౌర్యని కాకా పట్టడానికి సౌర్య కోసం చాక్లెట్ తెస్తుంది. హిమతో ప్రేమగా మాట్లాడుతూ.. హిమ పక్కనే ఉన్న సౌందర్యకు చురకలు వేస్తుంది సౌర్య. హిమ నవ్వుతూ.. సౌర్య ప్రేమగా మాట్లాడుతుంటే పొంగిపోతూ.. ‘సౌర్యా.. మనం ఇలానే ఫ్రెండ్స్‌లా ఎప్పుడు కలిసి ఉండాలి’ అనడంతో.. సౌర్య నవ్వుతూ.. ‘మనం ఫ్రెండ్స్ కాదు అక్కాచెల్లెల్లాంటోళ్లం’ అంటుంది. ‘నాన్నమ్మ కూడా అదే అంది సౌర్య’ అంటూ ‘అవునా..’ అంటూ సౌందర్య వైపు కాస్త కోపంగా చూస్తుంది సౌర్య.

దీప టెన్షన్

దీప ఏదో ఆలోచిస్తూ.. బాక్స్‌లు సర్దుతుంది. ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. ‘బాక్స్‌లు పట్టుకుని వెళ్తున్నావా?’ అన్న సౌందర్య పలకరింపుకు ఉలిక్కి పడిన దీప.. ‘మీరు ఎప్పుడు వచ్చారు అత్తయ్యా?’ అంటుంది. ‘అంతలా ఏం ఆలోచిస్తున్నావే?’ అంటూ సౌర్య ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అత్తయ్యా.. డాక్టర్ బాబు నన్ను తిడుతుంటే.. చాటుగా వింటుందట. ఈ మధ్య నిజం తెలిసిపోయిందా అన్నట్లుగా మాట్లాడుతుంది. ఏం అర్థం కావట్లేదు అత్తయ్యా’ అంటూ తనలోని భయాన్ని సౌందర్యకు చెప్పుకుంటుంది దీప.

ధైర్యమిచ్చిన సౌందర్య

‘దానికి నిజం తెలిస్తే ఇలా కూల్‌గా ఉంటుందా? తెలిసే ఛాన్స్ లేదు. నువ్వు అనవసరంగా భయపడకు. ధైర్యంగా ఉండు’ అంటుంది. తర్వాత తనే మాట్లాడుతూ.. ‘ఈ మధ్య హిమ ఏం ఆలోచిస్తుందో నాకూ అర్థం కావట్లేదే. అదేదో నీతో మాట్లాడాలట. మధ్యాహ్నం టైమ్‌కి నీ దగ్గరే తింటానని చెప్పింది. మమ్మల్ని ఎవర్నీ స్కూల్‌కి రావద్దని ఆర్డర్ కూడా వేసింది’ అని చెప్పడంతో దీప టెన్షన్‌గా ‘అది నాతో ఏం మాట్లాడుతుందట అత్తయ్యా?’ అంటుంది. ‘ఏమోనే అదే వివరంగా తెలియదు.. కానీ పిల్లలు మాత్రం మిమ్మల్ని కలిపే ప్రయత్నాలే చేస్తారని నమ్మకముంది’ అంటుంది సౌందర్య.

మౌనిత రీ ఎంట్రీ

‘ఏంటీ కార్తీక్ ఫోన్ చేసి మరీ వెనక్కి పిలిచావ్? ఇందాక క్లాస్ తీసుకున్నందుకు నాతో సారీ చెప్పించుకోవాలనా?’ అంటూ రీ ఎంట్రీ ఇస్తుంది మౌనిత. ‘నాకు థ్యాంక్స్ చెప్పాలని’ అంటాడు కార్తీక్. ‘దేనికీ?’ అంటుంది మౌనిత కంగారుగా. ‘అస్పష్టంగా ఉన్న నా ఆలోచనలకి నిర్థిష్టమైన రూపం వచ్చేలా మాట్లాడి వెళ్లినందుకు.. ఇప్పుడు నేను చాలా క్లారిటీతో ఉన్నాను’ అంటాడు కార్తీక్ కూల్‌గా. ‘ఏ విషయంలో’ అంటుంది మౌనిత అనుమానంగా.

కార్తీక్ క్లారిటీ

‘అది చెప్పేముందు నీకు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి కదా.. అది ముందుగా చెబుతాను. నేను మంచి వాడ్ని కానీ అతి మంచివాడ్ని కాదు. అమాయకుడ్ని అసలే కాదు. తప్పు ఒప్పు రెండూ తెలుసు నాకు. మంచి చెడు ఎక్కడ విడగొట్టాలో నాకు తెలుసు. నేనేం సంస్కారానికి చేతకాని తనానికి మధ్య కొట్టుమిట్టాడట్లేదు. సంస్కారం వైపు మాత్రమే ఉన్నాను.’ అంటూ క్లారిటీగా మాట్లాడుతుంటాడు.

నా క్యారెక్టర్ అది కాదు

దీపని నేను కావాలనే పెళ్లి చేసుకున్నాను. ఆమె తప్పు చేసింది కాబట్టే దూరమయ్యాను. అంత మాత్రాన్న కనపడిన ప్రతి సారీ ఆమె గుండె పగిలిపోయేలా మాట్లాడలేను. అది నా బలహీనత కాదు. మంచి తనమూ కాదు. వద్దు అనుకున్నప్పుడు వద్దు అంతే. ప్రతి సారీ చీరదించుకుంటూ పోతే నా ఒరిజినల్ క్యారెక్టర్ పోతుంది. నా స్వభావం అది కాదు’ అంటాడు కార్తీక్ సీరియస్‌గా. మౌనిత మౌనంగా వింటూ ఉంటుంది.

సౌర్య గురించి..

‘ఇక దీప కూతుర్ని ఆదరించడం గురించి కూడా నువ్వు చురకలు వేశావ్. దానికేం తెలుసు? నాకు ఇష్టంలేని మనిషి(దీప) కడుపన పుట్టడమేనా దాని తప్పు? ఆ పసిదాని మనసు నొచ్చుకునేలా ఎందుకు మాట్లాడాలి? ఎందుకు దూరం పెట్టాలి? ఎందరినో చదివిస్తున్నాను కదా. ఈ రౌడీని చదివిస్తే పోయేదేముంది? కాబట్టి సౌర్య గురించి కూడా పట్టించుకుంటున్నాను. అది నా మంచితనం కాదు నా చేతకాని తనం కాదు. నా స్వభావం. మా అమ్మ నేర్పిన మంచి అలవాటు. అందులో నీకు తప్పు కనబడితే అది నీ కర్మ. నేనేం చేయలేను’ అంటాడు కార్తీక్.

సౌందర్య గురించి..

‘మా అమ్మంటే ప్రాణం, నాన్నంటే గౌరవం, తమ్ముడంటే ఇష్టం, హిమంటే నా జీవితం. వీటిలో ఏ మార్పు ఉండదు. అభిప్రాయాల్లో బేధాలు ఉంటాయేమో కానీ.. అభిప్రాయబేధాలు వల్ల విడిపోయే ఛాన్సే లేదు రాదు. కాబట్టి ఇంకోసారి మా అమ్మ గురించి మాట్లాడి మన ఫ్రెండ్ షిప్‌ని పాడు చేసుకోకు. నేను ఇంతే మౌనిత ఇలానే ఉంటాను. అర్థమైందనుకుంటాను. క్లారిటీ వచ్చిందనుకుంటాను’ అంటాడు కార్తీక్ మౌనిత వైపు కోపంగా చూస్తూ.. దాంతో మౌనిత ఫ్యూజ్‌లు ఎగిరిపోయినట్లుగా చూస్తుంది.

దీప గురించి..

‘ఇప్పుడు నేను క్లారిటీకి వచ్చిన విషయం గురించి చెబుతాను. ఇవాళ నువ్వు నా మీద విసిరిన చురకలు, వెటకారంగా మాట్లాడిన మాటలు ఇవేం నేను పట్టించుకోలేదు. కానీ చివర్లో నువ్వు గుర్తు చేసిన కోర్టు గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నిజమే కోర్టు గడువు పూర్తయ్యే సరికి దీపని నేను పర్మినెంట్‌గా దూరం చేసుకుంటాను’ అంటూ వెనక్కి తిరిగి చెబుతూనే ఉంటాడు. దీపని దూరం చేసుకుంటానన్న మాట వినగానే మౌనిత ఆనందం పట్టలేక తనలో తనే నవ్వుకుంటుంది. సంతోషంతో పొంగిపోతుంది.

దీప పరువు తీస్తాను

కార్తీక్ మాట్లాడుతూనే ఉన్నాడు. ‘అవసరమైతే ఇన్ని రోజులు ఏ విషయాన్నైతే దాచి పెట్టి.. కోర్టులో దీప పరువు తీయ్యకుండా ఉన్నానో అది కూడా బయటపెట్టి.. దీప పరువు తీసైనా సరే తనని దూరం చేసుకుంటాను. దీప నా లైఫ్‌లోకి రాకుండా చూసుకుంటాను. కోర్టు గడువు పూర్తి కావడం కోసమే వెయిట్ చేస్తున్నాను’ అంటాడు కార్తీక్.

భార్యభర్తల సంభాషణ

‘అసలు అది(సౌర్య) ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదండీ.. నన్ను దొంగలా చూస్తుంది’ అంటూ తన బాధని భర్త ఆనందరావుతో చెప్పుకుంటుంది సౌందర్య. ‘ఎవరు? దీపా? హిమా? సౌర్యనా?’ అంటాడు ఆనందరావు అర్థం కాక. ‘అదేనండీ మూడోది..’ అంటుంది సౌందర్య. ‘ఏమైంది…? అయినా నువ్వు దొంగలించింది హిమని కదా? సౌర్య దొంగలా చూడ్డమేంటి?’ అంటాడు ఆనందరావు. వెంటనే సౌందర్య కోపంగా.. ‘అవునా.. మరి నేను దొంగనైతే మీరు తోడు దొంగా? ఆ రోజు మీరూ నా పక్కనే ఉన్నారుగా?’ అంటుంది కాస్త కోపంగా.. మళ్లీ సౌందర్యే మాట్లాడుతూ.. ‘పోనీలెండీ.. పిల్లలు మాత్రం వాళ్లని కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది’ అంటుంది సౌందర్య.

ఆదిత్య హెచ్చరిక

ఇంతలో ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు. ‘హా.. అలానే సరిపెట్టుకుని బతికెయ్యండి..’ అంటాడు. ‘అదేంట్రా అలా అంటావ్. పొద్దున్నే లేచింది మొదలు.. నేను వాళ్ల గురించి కాకుండా వేరే పనేదైనా చేస్తున్నానా? అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడతావేంట్రా?’ అంటుంది సౌందర్య. ‘హా అన్నీ తెలుసు.. ఇప్పుడు కాదు రేపు అన్నయ్య ఏదో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాక అప్పుడు, అప్పుడు కూర్చుని బాధపడుదురిగానీ’ అంటూ ఆవేశంగా వెళ్లిపోతాడు ఆదిత్య.

సౌర్యని మభ్యపెట్టి..

లంచ్ బెల్ మోగడంతో దీప దగ్గర లంచ్ చేసి.. ఓ పక్కనే కూర్చుంటారు సౌర్య, హిమలు. దీపతో మాట్లాడాలనే ఉద్దేశంతో సౌర్యకు నోడ్స్ ఇచ్చి.. ‘ఇది నిన్న క్లాస్‌లో చెప్పిన వర్క్. నెమ్మదిగా చేసుకో. ఇంకా టైమ్ ఉందిలే’ అంటూ సౌర్యని మభ్యపెట్టి దీప కోసం కళ్లతోనే వెతుకుతుంది హిమ. దీప క్యారేజ్ బాక్స్‌లు తీసుకుని సర్దుకుంటూ దూరంగా కనిపిస్తుంది. వెంటనే సౌర్యతో.. ‘ఇప్పుడే వస్తాను. పూర్తిగా రాసేసుకో’ అని చెప్పి సౌర్య చూడకుండా దీప దగ్గరకు వెళ్తుంది హిమ.

దీపని కూర్చోబెట్టి..

‘వంటలక్కా నీతో మాట్లాడాలి’ అంటుంది హిమ. ‘ఇందాకే మాట్లాడొచ్చుగా?’ అంటుంది దీప నవ్వుతూ.. ‘ఇందాక సౌర్య ఉందని మాట్లాడలేదు వంటలక్కా’ అంటుంది టెన్షన్‌గా హిమ. ‘సౌర్యపైన ఫిర్యాదునా? ఏమైనా అందా నిన్ను?’ అంటూ ఆరా తీస్తుంది దీప. ‘లేదు వంటలక్కా.. సౌర్యకు కోపం వచ్చే విషయం..’ అంటూనే చేయి పట్టుకుని దీపను పక్కకు లాక్కెళ్తుంది హిమ.

హిమ టెన్షన్..

ఓ బెంచ్ మీద కూర్చోబెట్టిన హిమ.. టెన్షన్ పడుతూ.. భయంతో వణుకుతూ.. ‘మరీ.. సౌర్య వాళ్ల డాడీ రారని మా డాడీ చెప్పారుకదా? రానివారికోసం ఎదురు చూడ్డం అనవసరం అని మా డాడీ చెప్పారు కదా?’ అంటూ మొదలుపెడుతుంది హిమ. కార్తీక్ అన్న మాటలను పదేపదే తలుచుకుంటూ.. ‘అయితే..’ అంటుంది దీప.

నువ్వు.. మా డాడీని..

అదే టెన్షన్‌తో హిమ.. తల కిందకు వంచుకుని.. దీపతో మాట్లాడుతుంది. దీపకు ఏం అర్థం కాక.. వింటూ ఉంటుంది. ‘మరీ.. మా డాడీ చాలా అందంగా.. పొడవుగా ఉంటాడుగా. పైగా తను చాలా మంచివాడు కూడా. కానీ మా డాడీని ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నాకు మా అమ్మ కూడా లేదు కదా’ అంటూ నసుగుతుంది హిమ. ‘ఏం చెబుతున్నావమ్మా? ఇదంతా నాకెందుకు చెబుతున్నావ్?’ అంటుంది దీప. ‘మరి నువ్వు మా డాడీని పెళ్లి చేసుకుంటావా?’ అంటుంది హిమ ఒక్కసారిగా. దీప సడన్‌గా పైకి లేస్తుంది. కోపంగా హిమ వైపు చూస్తుంది. హిమ భయపడుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.