Karthika Deepam Serial December 5th Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 669 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 670 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 5) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

దీప కోపాన్ని గమనించిన సౌర్య.. ‘అమ్మా నేను నిజంగానే బుక్స్ కొనుక్కోవడానికి వెళ్లాను’ అంటూ దీపకు ఎదురుగా కూర్చుని.. కొత్త నోట్ బుక్‌లో ‘సౌర్య, డాటర్ ఆఫ్ కార్తీక్’ అని పైకి చదువుతూ రాస్తుంది. అది విన్న దీప షాకింగ్‌గా పైకి లేస్తుంది. ‘ఏంటమ్మా లేచావ్? నువ్వేగా ఒకసారి స్కూల్ అడ్మీషన్ రోజు ఫోన్ చేసి అడిగితే నాన్న కార్తీక్ అని చెప్పావ్’ అంటూ దీపని కూల్ చేస్తుంది. వెంటనే ‘రేయ్ వారణాసీ.. రేపు త్వరగా రారా.. మనం బయటికి వెళ్లాలి’ అంటుంది సౌర్య. ‘ఎక్కడికి సౌర్యమ్మా?’ అంటాడు వారణాసి. దాంతో సౌర్య.. ‘డాక్టర్ కార్తీక్ ఇంటికిరా.. అవును నీకు తెలియదు కదూ.. మా నాన్న పేరు డాక్టర్ బాబు పేరు సేమేరా’ అంటూ వెటకారంగా మాట్లాడి దీపకు కోపం తెప్పిస్తుంది.

సరోజ సలహా

‘దీపా.. సౌర్య లేదుకదా.. డాక్టర్ బాబు దగ్గరకు వెళ్లింది కదా?’ అంటూ దీప దగ్గరకు వస్తుంది. ‘అవునా అక్కా నీకు ఎలా తెలిసింది?’ అనడంతో.. ‘అదే దీపా మా మరిది లక్షణ్ లేడు. తనని తీసుకుని డాక్టర్ బాబు దగ్గరకు వెళ్లిందట. నీకు ఎంతో హెల్ప్ చేశారు కదా.. థ్యాంక్స్ చెబుదువుగానీ పదా అని తీసుకుని వెళ్లిందట మా చెల్లి ఫోన్ చేసి చెప్పింది దీపా…’ అంటుంది సరోజ. దాంతో దీప టెన్షన్ పడుతుంది. ‘ఏంటో అక్కా ఏదీ సరిగా చెప్పట్లేదు. నైట్ వారణాసిని ఉదయాన్నే త్వరగా రారా డాక్టర్ బాబు దగ్గరకు వెళ్లాలి అంది. కానీ ఎందుకు అని అడిగితే విషయం చెప్పకుండా వాదించింది. అసలు ఈ సౌర్య ఏం చేస్తుందో ఏంటో అర్థమే కావట్లేదక్కా. స్నానం చేసి వచ్చేలోపే వెళ్తున్నానని వెళ్లిపోయింది’ అంటూ బాధపడుతుంది దీప. ‘ఎందుకు సౌర్య హాస్పెటల్‌లో నువ్వు డాక్టర్ బాబు మాట్లాడుకున్న మాటలు వినే ఉంటుందనిపిస్తుంది. ప్రశాంతంగా కూర్చోబెట్టి అడుగు దీపా’ అని సలహా ఇచ్చి వెళ్లిపోతుంది సరోజ.

సౌందర్య ఆనందరావులు షాక్

‘రాత్రి వర్షం పడినట్లుందండీ’ అంటుంది సౌందర్య భర్త ఆనందరావుతో.. ‘అవునా నాకు తెలియలేదే’ అంటాడు ఆనందరావు. ‘మీకు ఏం తెలియదు. పక్కనే పిడుగు పడినా తెలియదు’ అని సౌందర్య అంటూ ఉండగా పైనుంచి హిమ కార్తీక్‌తో కలిసి తిగుతూ ఉంటుంది. హిమని చూసిన సౌందర్య.. ‘అదిగో ఓ పిడుగు వస్తుంది. అక్కడ ఆ రెండో పిడుగు(సౌర్య) ఏం చేస్తుందో?’ అంటూ భర్తతో నసుగుతుంది సౌందర్య. ‘ఆ రెండో పిడుగు అక్కడ లేదు. అది కూడా ఇక్కడికే వచ్చింది’ అంటాడు ఆనందరావు టెన్షన్‌గా.. ఇంతలో సౌర్య ఓ కవర్ తీసుకుని లోపలికి వస్తుంది. పైనుంచి హిమ, కార్తీక్‌లు చేయి పట్టుకుని దిగడం చూసి కాస్త బాధగా చూస్తుంది సౌర్య. ముగ్గురినీ ఒకేసారి చూసి టెన్షన్ పడతారు సౌందర్య, ఆనందరావులు.

ఇదేం పరాయి వాళ్ల ఇళ్లు కాదు

సౌర్యని చూసిన హిమా.. ‘ఏంటి ఇలా వచ్చావ్ సౌర్యా?’ అని అడగడంతో.. ‘ఒకరిని తీసుకొచ్చాను’ అంటుంది. కార్తీక్ షాకింగ్‌గా చూస్తాడు. ‘ఎవరా ఒకరూ?’ అని అడుగుతుంది హిమ. ‘డాక్టర్ కాళ్ల మీద పడటానికి వచ్చారు’ అంటుంది సౌర్య. దాంతో ‘ఇది దీపని తీసుకొచ్చిందా?’ అని సౌందర్య, ‘దీప సౌర్యకు అంతా చెప్పిసిందా?’ అని ఆనందరావు, ‘దీని వాలకం చూసి తట్టుకోలేక దీప నా పేరు చెప్పేసిందా?’ అంటూ ఎవరి మనసుల్లో వాళ్లు ఆలోచించుకుంటాడు. ఇంతలో హిమ.. ‘ఎవరో లోపలికి రమ్మను సౌర్య’ అంటుంది. ‘అక్కడే నిలబడిపోయావే..లోపలికి రా.. ఎవర్వరూ ఏం అనరు. ఇదేం పరాయి వాళ్ల ఇళ్లు కాదు. మా నాన్న..అమ్మ(నాన్నమ్మ) వాళ్ల ఇల్లు రా’ అంటుంది సౌర్య. దాంతో లక్ష్మణ్..(సరోజ మరిది) లోపలికి వస్తాడు. వెంటనే ‘ఈవిడా నాన్నమ్మగారు. ఈయన తాతయ్యగారు. మాకు ఏమీ కారు. కానీ సొంతవాళ్లలాగే చూసుకుంటారు’ అంటూ కావాలనే వెటకారం చేస్తూ లక్ష్మణ్‌కి పరిచయం చేస్తుంది.

ఓ మాట అడగొచ్చా డాక్టర్ బాబు?

లక్ష్మణ్‌ని గుర్తు పట్టిన కార్తీక్.. ‘ఇతనా?’ అనడంతో.. ‘మీరు ఇంకెవరైనా అనుకున్నారా డాక్టర్ బాబూ’ అంటూ చురకలు వేస్తుంది. తర్వాత లక్ష్మణ్ కార్తీక్ కాళ్ల మీద పడి థ్యాంక్స్ చెబుతాడు. ‘మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది’ లక్ష్మణ్ థ్యాంక్స్ చెప్పడంతోనే.. ‘నువ్వు వెళ్లి ఆటోలో కూర్చో లక్ష్మణ్ మామా..’ అంటూ లక్ష్మణ్‌ని అక్కడ నుంచి పంపేస్తుంది సౌర్య. తర్వాత సౌర్య మళ్లీ మాట్లాడుతూ.. ‘డాక్టర్ బాబూ మిమ్మల్ని ఓ మాట అడగొచ్చా?’ అంటుంది సౌర్య. ‘నీకు అనడగాలనిపిస్తే అనుమతి అడగవుగా?’ అంటాడు కార్తీక్. ‘మీరు చాలా మంచివాళ్లు కదా డాక్టర్ బాబూ.. నిజంగా మంచివాళ్లేనా?’ అంటుంది. ‘అదేం ప్రశ్న రౌడీ?’ అంటాడు కార్తీక్ సంకోచిస్తూ.. ‘ఏం కానీ లక్ష్మణ్ మామకి 10 వేలు ఇచ్చారంటే మంచివాళ్లే. కానీ మా నాన్న.. మా నాన్నెవరో తెలిసి కూడా చెప్పడం లేదు కదా?.. అంటే కొంచమే మంచివాళ్లా?’ అని అడుగుతుంది.

మా డాడీ చాలా మంచివాడు

సౌర్య ప్రశ్నకు.. హిమ కలుగజేసుకుని.. ‘అలా అంటావేంటీ? మా డాడీ మొత్తం మంచివాడు. కొంచెమే ఏంటీ.. చాలా మంచివాడు’ అంటుంది. దాంతో సౌర్య ధీనంగా చూస్తూ.. ‘ఇప్పటికీ మా నాన్న గురించి చెప్పడం లేదు హిమా’ అంటుంది. సౌందర్య, ఆనందరావులు బాధగా సౌర్యవైపు చూస్తారు. ‘డాడీ చెప్పేసెయ్ డాడీ.. సౌర్యతో చెప్పేసెయ్’ అని హిమ అంటూనే.. సౌర్య వైపు తిరిగి.. ‘మా డాడీ అబద్దం చెప్పడు సౌర్యా.. మీ నాన్న రాడని మా డాడీ చెప్పేశారు కదా ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావ్?’ అంటుంది హిమ. ‘అవునా.. రాడా డాక్టర్ బాబూ? ఇంకెప్పటికీ రానే రాడా?’ అని కార్తీక్‌ని అడుగుతూనే.. ‘మీ నాన్న మా డాడీ రాడని చెప్పాడు కానీ.. తెలియదని చెప్పలేదుగా?’ అంటుంది సౌర్య హిమతో..

మా నాన్న ఎవరో చెప్పొద్దు! కానీ..

వెంటనే తను తీసుకొచ్చిన కవర్‌లోంచి ఓ టీ షర్ట్ తీస్తుంది. (దీప బర్త్ డేకి నాన్న వస్తాడని తెలిసి సౌర్య అప్పట్లో కార్తీక్‌ని మా నాన్న ఎలా ఉంటాడు అని అడిగి.. రెండు షర్ట్ తీసుకుని వస్తే.. ఒక లూజ్ షర్ట్ తీసుకుని.. ‘ఇది మీ నాన్నకు సరిగ్గా సరిపోతుంది రౌడీ’ అంటూ కావాలనే సెలెక్ట్ చేస్తాడు కార్తీక్.) ఆ షర్ట్‌ని కార్తీక్‌కి చూపిస్తూ.. ‘ఇది మీకు గుర్తుందా డాక్టర్ బాబూ.. మా నాన్న వస్తాడని నేను కొన్నాను. ఈ సైజ్ సరిపోతుందని మీరే నాకు చెప్పారు. కానీ నాకు తెలిసిన వాళ్లు ఎవరో చెప్పారు. మీ నాన్న అచ్చు డాక్టర్ బాబులా తెల్లగా సన్నగా ఉంటారు అని. ఇప్పుడు మా నాన్న లావు అయ్యుంటాడు. డాక్టర్ బాబూ.. మా నాన్న ఎవరో చెప్పొద్దు. ఇది తీసుకెళ్లి మీ కూతురు ఇచ్చిందని చెప్పి ఆయన చేతికే ఇవ్వండి’ అంటూ కార్తీక్ చేతిలో ఆ టీ షర్ట్ పెట్టి అక్కడ నుంచి బాధగా వెళ్లిపోతుంది సౌర్య. సౌందర్య, ఆనందరావులు బాధపడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. కార్తీక్ నిస్సహాయంగా బాధగా చూస్తూ ఉండిపోతాడు. చేతిలోని టీ షర్ట్‌ని విసిరి కొట్టాలనేంత కోపం, సౌర్య మీద జాలి, హిమ గమనిస్తుందన్న భయం ఇవన్నీ కార్తీక్‌ని ధర్మసంకటంలో పారేశాయి. దాంతో చేతిలోని షర్ట్‌ని విసిరేయకుండా కోపాన్ని అనుచుకుంటాడు.

ఎందుకు ఆ ఇంటికి వెళ్లింది?

మౌనిత జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటే.. ప్రియమణి వయసు అయిపోతుందని, త్వరగా కార్తీక్ అయ్యని పెళ్లి చేసుకోమని డొంకతిరుగుడు మాటలతో హితబోధ చేస్తుంది. సౌందర్య, ఆనందరావులు సౌర్య మానసిక పరిస్థితి గురించి ఆలోచిస్తారు. ‘నిజం తెలిసి పోయిందేమో’నని సౌందర్య భయపడుతుంటే.. ఆనందరావు మాత్రం.. ‘నిజం తెలిస్తే అది అలా కూల్‌గా ఉండే రకం కాదు’ అంటూ సౌందర్య ఆలోచనలకు బ్రేక్ వేస్తాడు. దీప ఆటోలో వెళ్తూ.. వారణాసికి ఆరాలు తీస్తుంది. ‘సౌర్య.. ఎందుకు కార్తీక్ ఇంటికి వెళ్లింది? అక్కడ ఏం మాట్లాడింది?’ ఇలా చాలా ప్రశ్నలు వేస్తుంది. కానీ వాటికి సమాధానాలు వారణాసి చెప్పలేకపోతాడు. ‘సౌర్య ఏం చేస్తున్నా.. ఏదీ నాకు తెలియనివ్వలేదు అక్కా.. కాకపోతే డాక్టర్ బాబు ఇంట్లోకి వెళ్తూ ఓ కవర్ తీసుకుని వెళ్లింది. తిరిగి వచ్చినప్పుడు ఆ కవర్ తీసుకుని రాలేదు అక్కా’ అంటాడు వారణాసి. దాంతో దీప టెన్షన్‌గా ‘అయితే ఈ విషయం గురించి అత్తయ్యని అడగాలి’ అనుకుంటుంది మనసులో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.