కాటమరాయుడు ఫైట్ ముందే వచ్చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి లీకుల బెడద తప్పటం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు సీన్స్ కూడా ఆన్ లైన్ లో రిలీజ్ కు ముందే దర్శనమిచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పూర్తి సినిమాలు కూడా రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా యాక్షన్ సీన్ ఒకటి ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. ఈ సీన్ సినిమా ఇంటర్వేల్ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కు సంబందించినదన్న ప్రచారం జరుగుతోంది. రైల్వే స్టేషన్ లో షూటింగ్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ లో పవన్ ఫైట్స్ అభిమానులను అలరిస్తున్నాయి. అదే సమయంలో క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.

అయితే.. ఎక్కువగా ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోల నుంచి ఈ లీకులు జరుగుతుండగా పలు సందర్భాల్లో యూని సభ్యులే లీకులిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  ఇంతకుముందు బాహుబలి2 గ్రాఫిక్సుకు సంబంధించిన సీన్లు కూడా లీకయ్యాయి.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకూ ఈ బెడదల తప్పడం లేదు.  తాజాగా రంగూన్‌ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా అలా విడుదలైందో లేదో ఇలా ఆన్ లైన్లో పెట్టేశారు ఎవరో.  విడుదలైన వెంటనే ఈ సినిమా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి లోనైంది. సినిమా మొత్తం ఆన్ లైన్ లో వచ్చేయడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడనుంది.  అయితే.. తెలుగు ఇండస్ర్టీలో మాత్రం హైప్ క్రియేట్ చేయడం కోసం.. ప్రచారం కోసం కూడా ఇలా ముందుగా లీకులిస్తున్నారన్న ఆరోపణలూ ఉంటున్నాయి.