ఇంటర్వెల్ ఫైట్ సీన్.. కేజిఎఫ్ 2లో అరాచకం అంటున్నారే..!

దాదాపు మూడేళ్ళ క్రితం విడుదలైన కేజిఎఫ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ఇండస్ట్రీలతో పని లేకుండా విడుదలైన అన్ని చోట్లా సంచలనాన్ని నమోదు చేసింది. యష్ మాస్ స్క్రీన్ ప్రెజన్స్ కు తోడు, ప్రశాంత్ నీల్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే బాక్స్ ఆఫీస్ వద్ద అరాచకాన్ని సృష్టించింది.

ఈ సినిమాకు ఇప్పుడు కొనసాగింపు కేజిఎఫ్ పార్ట్ 2 వస్తోంది. మొదటి పార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో రెండో పార్ట్ పై ఆటోమేటిగ్గా అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. జులై 16న కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదలవుతోన్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది.

సరిగ్గా ఇంటర్వెల్ కు ముందు ఈ సినిమాలో అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందిట. దాదాపు 10 నిముషాలు ఉండే ఈ ఫైట్ మాస్ కు సరికొత్త డెఫినిషన్ ఇస్తుందని, సరికొత్త అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారని అంటున్నారు.