సందీప్ ను అన్న అనేసిన లావణ్య.. ఎందుకంటే!

హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబైంది. హాకీ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం మార్చ్ 5న విడుదలవుతోంది. టాలీవుడ్ లోనే మొదటి హాకీ బేస్డ్ సినిమా కావడంతో ఈ చిత్ర రిజల్ట్ పై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏ1 ఎక్స్ ప్రెస్ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న లావణ్యకు ఈ సినిమా విజయం చాలా ముఖ్యం.

ఇక అసలు విషయానికి వస్తే, ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య త్రిపాఠి అనుకోకుండా హీరో సందీప్ కిషన్ ను అన్న అనేసింది. తర్వాత కవర్ చేసినా కూడా ఇప్పటికే ఆ కామెంట్స్ వైరల్ అయిపోయాయి. “ఈ చిత్రం నా మనసుకు బాగా దగ్గరైంది. కథ వినగానే బాగా నచ్చేసింది. కోవిద్ సమయంలో కూడా ఈ చిత్రాన్ని కష్టపడి పూర్తి చేసాం. సందీప్ అన్న గురించి చెప్పాలంటే..” అనేసి మళ్ళీ తనను తాను సరిదిద్దుకుని, “హీరోను అన్న అనడం కరెక్ట్ కాదు. తను మీ అందరికీ అన్న, నాకు కాదు” అని వివరణ ఇచ్చింది.