చరణ్‌, నేను చాలా క్లోజ్‌.. ఫాన్స్‌కి పడదు: మహేష్‌

తమిళనాడులో కంటే తెలుగునాట ఫాన్‌ వార్స్‌ ఇంకా ఇంటెన్స్‌గా వుంటాయని మహేష్‌బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ”నేను చిరంజీవి సర్‌కి, చరణ్‌కి చాలా క్లోజ్‌. అయినప్పటికీ ఫాన్స్‌ మాత్రం బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ కోసం కొట్టుకుంటారు” అని మహేష్‌ వ్యాఖ్యానించాడు. మహేష్‌ చెబుతున్నది నిజమే.

అక్కడ మహేష్‌, చరణ్‌ ఫ్యామిలీస్‌తో కలిసి విదేశాలకి టూర్లకి వెళ్లి ఎంజాయ్‌ చేసి వస్తోంటే, ఇక్కడేమో వారి అభిమానులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ కాలం వెల్లదీస్తుంటారు. చరణ్‌ సినిమా వస్తే మహేష్‌ ఫాన్స్‌ ఫ్లాప్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేయడం, మహేష్‌ సినిమా ఫ్లాప్‌ అయిందంటే చరణ్‌ ఫాన్స్‌ సంబరాలు చేసుకోవడం అనేది అలా జరుగుతూనే వుంటుంది. ‘అరె మన హీరో స్నేహితుడి సినిమానే కదా’ అనేది వుండదు.

హీరోల మధ్య సఖ్యత అనేది ఎప్పుడూ వున్నా ఫాన్స్‌కి మాత్రం అవతలి హీరో, అతని అభిమాని ఎప్పుడూ శత్రువులే. కాలంతో మారాల్సిన ఈ పద్ధతి ఇంకా ఇంకా ముదిరిపోయింది. ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువగా ఫాన్‌ వార్స్‌ తారాస్థాయిలో జరుగుతున్నాయి. సోషల్‌ మీడియా పుట్టుకతో ఈ జాఢ్యం బాగా ఎక్కువైపోయింది.