కర్నూల్ కి వెళ్లిన మహేష్ మాస్ సెలబ్రేషన్స్

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన `సర్కారు వారి పాట` డివైడ్ టాక్ తో రన్నింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ ఇమేజ్ తో భారీ ఓపెనింగ్స్ సాధించినా డివైడ్ టాక్ ప్యాక్టర్ సినిమాపై కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే సమ్మర్ హాలీడేస్ కావడం సహా ఇరత హీరోల సినిమాలు మార్కెట్ లో లేకపోవడంతో మహేష్ సినిమా వసూళ్లపై అంతగా ప్రభావాన్ని అయితే చూపించలేదు.

శని..ఆదివారలు ఇతర రంగాల వారికి సెలవులు కావడంతో హౌస్ పుల్ గానే థియేటర్లు నడుస్తున్నాయి. మరి అంతిమంగా ఫుల్ రన్ లో `సర్కారు వారి పాట` ఎంత సాధిస్తుందన్నది? తెలియడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. ఇప్పుడప్పుడే మహేష్ సినిమా వసూళ్లని అంచనా వేయడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు.

గతంలో రివ్యూలు పాజిటివ్ గా లేకపోయినా బాక్సాపీస్ ని షేక్ చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. సరిగ్గా `జనతా గ్యారేజ్ `సినిమాకి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. రొటీన్ సినిమా అని అని విమర్శించారు. కానీ ఫుల్ రన్ లో బాక్సాఫీస్ లెక్కలు చూస్తే రివ్యూలు ఏపాటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నది జనాలకి అర్ధమైంది. `సర్కారు వారి పాట`కి రివ్యూలు ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు.

మరి వాటిని ఓవర్ కమ్ చేసి మహేష్ బాక్సాఫీస్ ని షేక్ చేసి తమ అంచనానే కరెక్ట్ అని చెబుతారా? రివ్యూలే ఫలితాల్ని నిర్దేశిస్తాయా? అన్నది తెలియడానికి సమయం పడుతుంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ షురూ చేసింది. ఈనెల 16 న కర్నూల్ లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో విజయోత్సవ వేడుక నిర్వహిస్తున్నారు.

సిటీలోని ఎస్టీ బీసీ కళాశాల అందుకు వేదికైంది. సాయంత్రం ఆరు గంటల నుంచి `మ మ మాస్ మహేష్` పేరిట సెలబ్రేషన్స్ మొదలు కానున్నాయి. వీటికి మహేష్ సతీసమతేంగా హాజరు కానున్నారు. మరి ముఖ్య అతిధిగా ఏస్టార్ నైనా సక్సెస్ లో భాగం చేస్తున్నారా? లేదా? అన్నది తెలియాలి. వాస్తవానికి ఈ వేడుకల్ని ముందుగా విజయవాడలో నిర్వహించాలని ప్లాన్ చేసారు. మేకర్స్ కూడా విషయానల్ని అధికారికంగా వెల్లడించారు. కానీ కొన్ని సమస్యల కారణంగా వేదికని విజయవాడ నుంచి కర్నూల్ కి మార్చారు.

కర్నూల్ తో -మహేష్ అనుబంధం వీడదీయరానిది. మహేష్ ని స్టార్ గా చేసిన `ఒక్కడు` సినిమా కర్నూల్ బ్యాక్ డ్రాప్ లోనే కొంత కథ సాగుతుంది. సీమ ఫ్యాక్షనిజం..కబడ్డీ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా పెద్ద సక్సెస్ అయింది. కొండా రెడ్డి బురుజు ఆ సినిమాతో మరింత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడదే కర్నూల్ కి మహేష్ మరోసారి సర్కారు వారి పాట సెలబ్రేషన్ల కోసం కుటుంబంతో హాజరు కానున్నారు.

ఇక `సర్కారు వారి పాట` అమెరికా వసూళ్లు ఇలా ఉన్నాయని నిర్మాతల వెర్సన్ ని బట్టి తెలుస్తుంది. అమెరికాలో ఇప్పటివరకూ 1.8 మిలియన్ డార్ల వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు పోస్టర్ వేసి అధికారికంగా రివీల్ చేసారు. యూఎస్ ఏ గ్రాస్ 1.8 మిలియన్ వసూళ్లు ప్లస్ లో ఉంది. కోవిడ్ మహమ్మారి తర్వాత `ఆర్ ఆర్ ఆర్` మినహా ఏ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించలేదన్నది నిర్మాతల వెర్షన్. ఇటు తెలుగు రాష్ర్టాల్లో సినిమా మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

ఏపీ-తెలంగాణ లో మొదటి రోజు షేర్-36.89 కోట్లు.. రెండవ రోజు 11.64 కోట్లు..మూడవ రోజు-13.01 కోట్లులల కాగా.. మొత్తం మూడు రోజుల షేర్ 61.54 కోట్లుగా తెలుస్తుంది. ఈ లెక్కలు ఏరియాల వైజ్ చూస్తే.. ఈస్ట్ గోదావరి మూడు రోజుల షేర్ 5.39 కోట్లు.. థర్డ్ డే చూస్తే 1.06 కోట్లగా ఉంది. ఈస్ట్ లో ఇది సరికొత్త రికార్డు. నైజా మూడు రోజుల షేర్ 23.27 కోట్లు. థర్డ్ డే షేర్ 58305311 రూ..లు. నెల్లూరు మూడు రోజుల షేర్ 2.42 కోట్లు. థర్డ్ డే షేర్ 4506388 రూ..లు. మూఎస్ ఏ మూడు రోజలు షేర్ 7.33ల కోట్లు..థర్డ్ డే షేర్ 19502410 రూలు గా ఉంది.

ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్- 14 రీల్స్-జీఎంబీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. థమన్ సంగీతం అందించారు.