మహేష్ అభిమానులకు కూడా నిరాశ తప్పేలా లేదు

రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ కోసం ఎదురుచూసారు. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా పనులేం జరగలేదు కాబట్టి ఆర్ ఆర్ ఆర్ టీమ్ అనుకున్న ప్రకారం వీడియో విడుదల చేయలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు చూస్తుంటే మహేష్ బాబు అభిమానులకు కూడా నిరాశ తప్పేలా లేదు.

ఎందుకంటే మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తర్వాతి సినిమా గురించి ప్రకటన ఉంటుందని, కుదిరితే టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని అంచనా వేశారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.

అయితే కృష్ణ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. తన భార్య విజయ నిర్మలను కోల్పోయిన తర్వాత కృష్ణ ఒంటరిగా ఫీలవుతున్నారు. పైగా వచ్చే నెల ఆమె సంవత్సరీకం చేయాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్న విషయం కూడా తెల్సిందే.

పై కారణాలతో కృష్ణ పుట్టినరోజు వేడుకలను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా ఎటువంటి కార్యక్రమాలను చేయొద్దని తెలిపారు. దీంతో మహేష్ బాబు సినిమా ప్రకటన కూడా ఉండదని వార్తలు మొదలయ్యాయి. ఏకంగా షూటింగ్ లు మొదలయ్యాక సినిమా ప్రకటన చేసి లాంచ్ కు వెళ్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.