మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ లో సిల్క్ స్మిత.!

కరోనా వలన షూటింగ్స్ ఆగిపోయి 5 నెలక్లూ దాటింది, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చి 8 నెలలు దాటింది. ఇటీవలే మొదటి సారి ఒక యాడ్ షూట్ లో పాల్గొన్నారు. కాసేపు ఇది పక్కన పెడితే.. మహేష్ బాబు 27వ సినిమాగా పరశురామ్ డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట’ అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ని అబ్రాడ్ లో మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఇప్పటికే పలువురిని అనుకున్నా ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. తాజాగా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా ఇంకో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని కూడా ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. తను ఎవరో కాదు.. మన తెలుగు ఐటెం గర్ల్ సిల్క్ స్మిత జీవిత కథతో సౌత్ లో వచ్చిన ‘థర్టీ పిక్చర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ విద్య బాలన్. తను డైరెక్ట్ గా తెలుగులో ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కూడా నటించింది.

తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాటలో మహేష్ బాబు అక్క పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్ర కోసం విద్య బాలన్ ని సంప్రదించారు. విద్య బాలన్ అయితే కాస్త ఆసక్తిగానే ఉన్నారు. చర్చల దశలో ఉన్న ఈ ఛాయస్ పై త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది. మహేష్ బాబు – విద్య బాలన్ కాంబినేషన్ కూడా చూడటానికి చాలా బాగుంటుందని, అలాగే సినిమాని మలుపు తిప్పే పాత్ర కావడంతో నటనతోనూ మెప్పిస్తుందని ఈ ఛాయస్ కి వెళ్లినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ కథాంశం మొత్తం ప్రభుత్వంలో జరిగే కొన్ని లూప్ హొల్స్ గురించి, మనీ లాండరింగ్ లాంటి విషయాలను గట్టిగానే ప్రస్తావించనున్నారని సమాచారం. అలాగే ఓ స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు పరశురామ్ మార్క్ ఫామిలీ కథాంశం, లవ్ స్టోరీ కూడా ఉంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టీం దాదాపు బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు చేశారు.