ఎన్టీఆర్‌తో కంటే ముందు మహేష్‌ తో త్రివిక్రమ్‌

ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ను చేయబోతున్న విషయం తెల్సిందే. వీరి కాంబో మూవీ సంవత్సరం క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఆలస్యం అయ్యింది. దాంతో ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ మూవీ అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. మే నెలలో ఎన్టీఆర్‌ 30 త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా మళ్లీ వాయిదా పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌ మరో హీరో తో సినిమాకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే మహేష్‌ బాబును త్రివిక్రమ్‌ కలిశాడట. వీరిద్దరి కాంబో మూవీ కోసం అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కేందుకు సిద్దం అయ్యింది. పూజా హెగ్డే హీరోయిన్‌ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్‌ తో సినిమా పూర్తిగా క్యాన్సిల్‌ అయ్యిందా లేక ఆలస్యం కానుందా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో త్రివిక్రమ్‌ మరియు మహేష్‌ బాబుల కాంబో మూవీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ మరియు మహేష్‌ బాబు అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఎన్టీఆర్‌30 హ్యాష్‌ ట్యాగ్‌ ఇండియా వైడ్‌ గా ట్రెండ్‌ అవుతోంది.