Mouna Raagam Serial December 5th Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్‌ 381 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 382 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్‌ మీకోసం. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (డిసెంబర్ 5) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.

అపశకునం.. అమ్ములు హ్యాపీ!

పెళ్లి ముహూర్తాలు ఇందులో ఉన్నాయి, ఏది మీకు కుదురుతుందో అది మీరు చూడండ‌మ్మా అంటూ పూజారి.. నీల‌వేణికి ఇస్తాడు. క‌ళ్ల‌కు అద్దుకుని తీసుకుంటుంది. ఇంత‌లో భ‌ర‌త్‌.. అమ్ములుతో ర‌హ‌స్యంగా చూశావా.. నీ జాత‌కం కొన్ని నిమిషాల్లో నిర్ణ‌యించ‌బడుతుంది. ఇక‌నైనా పిచ్చి ఆలోచ‌న‌లు మానేసి చ‌క్క‌గా ఉండు అంటాడు. ఇంతలో నీల‌వేణి ముహూర్తాలు చూసే ప్ర‌య‌త్నం చేస్తుంటే దేవుడి ప‌టం కింద ప‌డిపోతుంది. శ‌కునం బాగుండ‌లేదనే అర్ధంతో అంతా షాక్ అవుతారు. దాంతో పూజారి ‘అపశకునం అనుకుంటున్నారు కాబట్టి.. ఆ ముహూర్తం కాగితాలు.. దేవుడి దగ్గర పెట్టి రేపు ఉదయాన్నే చూడండమ్మా’ అంటాడు పూజారి. దాంతో అమ్ములు ఊపిరి పీల్చుకుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే భరత్ మాత్రం అమ్ములుతో ‘తప్పింది ఈ ఒక్కరోజు మాత్రమే’ అంటూ నవ్వి వెళ్లిపోతాడు.

అమ్ముల్ని నిలదీసిన స్నేహ!

స్నేహా టెన్షన్ పడుతుంటే అమ్ములు వెళ్లి ‘ఏమైంది స్నేహా?’ అని అడుగుతుంది. దాంతో స్నేహా రివర్స్ అయిపోతుంది. ‘మొత్తం నీ వల్లే నాకు ఈ టెన్షన్. నువ్వే నాకు సమాధానం చెప్పాలి. నువ్వు తల వంచుకుని భరత్‌తో తాళి కట్టించుకుంటే.. అక్షింతలు వేసి ఆశీర్వదించడానికా నన్ను ఇక్కడకు రమ్మంది?’ అంటూ గట్టిగానే నిలదీస్తుంది. ‘ఒకసారి భరత్ దూరం అయ్యాడని చాలా బాధ పడ్డాను. మళ్లీ బాధపడే ఓపిక లేదు. ఏం చేస్తావో నాకు తెలియదు అమ్ములు. నువ్వు నా జీవితాన్ని చక్కదిద్దాలి’ అంటుంది. దాంతో అమ్ములు బాధతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

భరత్ వార్నింగ్

గొడ్ల సావిడిలో కూర్చుని స్నేహ అన్న మాటలు తలుచుకుంటూ.. ఆలోచిస్తుంది అమ్ములు. వెంటనే.. బొమ్మలు వేయడం మొదలుపెడుతుంది. భరత్ అంకిత్‌ని కొట్టించాడని, అంకిత్‌ని చంపాలని చూస్తున్నాడని.. సీనయ్యని మోసం చేస్తున్నాడని బొమ్మల్లో అర్థమయ్యేలే వేస్తుంది. ఇంతలో భరత్ అక్కడికి వచ్చి.. ‘ఛాలెంజ్ మరిచిపోయి ఇలాంటి పనులు చేస్తున్నావేంటీ అమ్ములు? అయినా నువ్వు వేయాల్సినవి ఇలాంటి బొమ్మలు కాదు. నేను నీకు తాళి కడుతున్నట్లు, మనం శోభనం గదిలో ఉన్నట్లు, నీ చంకలో ఓ చంటిబిడ్డ ఉన్నట్లు బొమ్మలు గీయాలి.. వీటిని మీ నాన్నకు చూపిస్తావా?’ అంటూ కోపంతో రగిలిపోతాడు. అమ్ములు చేతుల్ని గట్టిగా పట్టుకుని.. బలవంతంగా ఆ డ్రాయింగ్ షీట్స్‌ని ముక్కముక్కలు చేసి ముఖాన్న కొడతాడు. ‘ఆ అంకిత్ గాడ్ని చంపేస్తాను. స్నేహ జీవితంతో నాకు సంబంధంలేదు. తనని రమ్మన్నది నువ్వు. నువ్వు తప్పు చేస్తే తను శిక్ష అనుభవిస్తుంది. నాకు తను అడ్డు వస్తే తనని కూడా చంపేస్తాను’ అంటూ బెదిరించి వెళ్లిపోతాడు. దాంతో అమ్ములు అక్కడే కుప్పకూలి బాగా ఏడుస్తుంది.

లక్కీతో మాట తీసుకున్న అమ్ములు

నీలవేణి.. మూహూర్తం చూడ్డానికి వెళ్తుంది. అక్కడ ముహూర్తం కాగితం ఉండదు. అది లక్కీ తీసుకుని వెళ్లి అమ్ములుతో.. ‘వదినా ఇందులో నీ జాతకం ఉంది. నువ్వు ధైర్యం చేసి మీ నాన్నను బాధపెట్టి నిజం చెప్పలేవు కదా. అందుకే ఇందులో ముహూర్తం డేట్ మార్చేస్తాను. దగ్గర్లో పెళ్లి ముహూర్తం ఉంటే.. కాస్త దూరం ఉన్నట్లుగా డేట్ మారుస్తాను’ అంటుంది లక్కీ. అందుకు అమ్ములు ఒప్పుకోదు సరికదా.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తన మీద ఒట్టుపెట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే నీలవేణి లోపలి నుంచి బయటికి వస్తూ.. లక్కీ, అమ్ములు మీద ఒట్టుపెట్టడం చూసి.. షాక్ అవుతుంది.

క‌మింగ్ అప్‌లో…

సీనయ్య ముహూర్తం చూసి.. నవ్వుతూ.. ‘వచ్చే సోమవారమే మీ పెళ్లి అమ్మా.. నువ్వు సంతోషమే కదా?’ అని అడుగుతాడు అమ్ముల్ని. అమ్ములు మౌనంగా ఉంటుంది. మరోసారి అడుగుతాడు. దాంతో అమ్ములు ‘సంతోషంగా లేను’ అంటూ అడ్డంగా తల ఊపుతుంది. భరత్ షాక్ అవుతాడు. లక్కీ, స్నేహాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ‘నీకు ఈ పెళ్లి ఇష్టమే కదమ్మా?’ అంటాడు సీనయ్య. అమ్ములు ‘లేదు’ అని మరోసారి తల అడ్డంగా తిప్పుతుంది. అంతా షాక్ అవుతారు. మ‌రిన్ని వివ‌రాలు త‌రువాయి భాగంలో చూద్దాం. మౌన‌రాగం కొన‌సాగుతోంది.