నాన్న హీరోయిన్‌తో కొడుకు రొమాన్స్

ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకు జోడీగా నటించిన శ్రీదేవి.. రాధ లాంటి హీరోయిన్లతో అక్కినేని నాగార్జున కూడా రొమాన్స్ చేశాడు. ఇక లేటెస్టుగా తన కొడుకు రామ్ చరణ్ సరసన మూడు సినిమాల్లో కథానాయికగా నటించిన కాజల్‌తో చిరు జంటగా నటించాడు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. నాగ్‌తో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో రొమాన్స్ చేసిన లావణ్య త్రిపాఠితో చైతూ జోడీ కట్టనున్నాడు. కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో చైతూ మంగళవారమే ఒక సినిమా మొదలుపెట్టాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్.. వారాహి చలనచిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలో లావణ్య కథానాయికగా నటిస్తోంది. లావణ్య.. ‘మనం’ సినిమాలోనూ చైతూతో కలిసి నటించింది. అందులో ఆమె అతడి ఫ్రెండు పాత్ర పోషించింది. ఈసారి మాత్రం కథానాయికగానే కనిపించనుంది. మరి నాన్నతో రొమాన్స్ చేసిన కథానాయికగా చైతూ.. ఎంత సౌకర్యంగా ఫీలవుతాడో చూడాలి. ఈ చిత్రం ఒక పంజాబీ హిట్ మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ‘సోగ్గాడే..’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేస్తున్న చైతూ.. కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. తన మావయ్య సురేష్ నిర్మాణంలో చైతూ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.