మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్..

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 50లక్షలకు చేరువలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ కోవిడ్-19 బారిన పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపారు.

కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఇన్ ఫెక్షన్ నుంచి కోలుకుంటాను. దీని నుంచి బయటపడి ప్లాస్మా దానం చేస్తాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు, వీడియోలు చేస్తున్నారు. రీసెంట్ గా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఆయనకు వైరస్ సోకిందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.