ఆ టైంలో ఊపిరాడక ఇబ్బందిపడ్డా: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే కోవిద్ బారిన పడిన విషయం తెల్సిందే. కొద్దిరోజుల క్రితమే కరోనా నుండి పూర్తిగా కోలుకున్న నాగబాబు ఇప్పుడు తన అనుభవాలను చెప్పుకొచ్చాడు. అందరిలా కరోనాను జయించానని తాను చెప్పుకోవట్లేదని అన్నాడు నాగబాబు. ఒక అంటువ్యాధి నుండి కోలుకున్న రోగిగానే భావిస్తానని అన్నాడు.

నాకు ఆస్తమా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ రావడంతో చాలా కంగారు పడ్డా. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చేరా. కొన్ని రోజుల తర్వాత ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించేది. కరోనా వచ్చిన మూడో రోజు నుండి వాసన తెలీలేదు, రుచులు గుర్తించడం కూడా తగ్గింది. అయితే డాక్టర్లు ఇచ్చిన వైద్యం పాటించడంతో, ఆ మందులు వేసుకోవడంతో కరోనా లక్షణాలు తగ్గాయి. దాంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాను. ఇంటికి వచ్చాక నా భార్య పద్మజకు కరోనా సోకింది.

దీంతో ఇద్దరం ఇంట్లోనే ఐసోలేషన్ ఉన్నాం. అది చాలా కష్టమైనా కూడా మొత్తానికి దాన్నుండి బయటపడ్డాం. నేను చెప్పేది ఒకటే. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే కోవిద్ టెస్టులు చేయించుకోండి. మీ శరీరం కోవిద్ ను పోరాడగలిగినా, మీ పక్కవాళ్ళకు అది మరింత ఎఫెక్ట్ చూపించవచ్చు. కరోనాను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు అని నాగబాబు చెప్పుకొచ్చాడు.