ఫస్ట్‌ నైట్‌ గురించి అందరికి తెలుసు, అదే వివాదాస్పదం కాదుః నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు జబర్దస్త్‌ నుండి తప్పుకున్న తర్వాత జీ తెలుగులో అదిరింది కార్యక్రమానికి జడ్జ్‌ గా వ్యవహరించాడు. ఆ సమయంలోనే ఆయన తన యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా స్టాండప్ కామెడీని తీసుకు వచ్చాడు. స్టాండప్ కామెడీ ఎపిసోడ్‌ ను ఖుషి ఖుషిగా అంటూ నాగబాబు యూట్యూబ్‌ ద్వారా స్ట్రీమింగ్‌ చేస్తున్నాడు. తాజాగా 11వ వారంకు సంబంధించిన ఎపిసోడ్‌ ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమోలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఫస్ట్‌ నైట్‌ గురించి నాగబాబు చేసిన ఆ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

షోలో భాగంగా ఒక కమెడియన్‌ నేను ఈరోజు ఎంపిక చేసుకున్న టాపిక్‌ వివాదాస్పదమైనది మరియు ఆసక్తికరమైనది అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే నాగబాబు అందుకుని అది వివాదాస్పదం అని ఎలా అంటావు. అందరికి బాగా అవసరమైనది ఆసక్తికరమైన టాపిక్‌. ఈ రోజుల్లో ఫస్ట్‌ నైట్‌ గురించి తెలియనిది ఎవరికి అందరికి తెల్సిందే. అప్పట్లో ఫస్ట్‌ నైట్‌ అనేది శోభనం గదిలో జరిగేది. కాని ఇప్పుడు హోటల్‌ రూమ్‌ ల్లో జరుగుతుంది అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ్ల పిల్లలకు అన్ని తెలుసు కనుక నువ్వు నిర్మొహమాటంగా నీ కామెడీ కానిచ్చేయి అన్నాడు.