నాగార్జున వైల్డ్ డాగ్ కు యాక్షన్ డైరెక్టర్ గా బాలీవుడ్ నటుడి తండ్రి

అక్కినేని నాగార్జున నటిస్తోన్న తర్వాతి చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపిస్తోన్న విషయం తెల్సిందే. సోలమన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత వారం రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హిమాలయాస్ లోని రోహ్తాంగ్ పాస్ లో కొనసాగుతోంది. సముద్రపు మట్టం నుండి దాదాపు 13,000 ఫీట్ వద్ద షూటింగ్ జరుగుతోంది.

బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శామ్ కౌశల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో తన హవా చూపిస్తోన్న విక్కీ కౌశల్ తండ్రే ఈ శామ్ కౌశల్. “దేవుడి దయ వల్ల రోహ్తాంగ్ పాస్ వద్ద షూటింగ్ చేస్తున్నాం. జీరో వాతావరణం ఇక్కడ ఉంది. ఈ సీజన్ లో మొదటి మంచుని చూసాం” అని ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం నాగార్జున హిమాలయాస్ వద్ద ఉండడం వల్ల బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొనలేకపోయాడు. ఆయన స్థానంలో సమంత తాత్కాలికంగా నిన్నటి ఎపిసోడ్ ను నడిపించింది. అయితే వచ్చే వారంలో నాగార్జున షూటింగ్ కోసం కచ్చితంగా హైదరాబాద్ వస్తాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.