ఫిల్మ్ నగర్లో కనిపించొద్దన్న రోహిత్..

okkadగత ఏడాది ఆఖర్లో వచ్చిన ఓ చిన్న సినిమా అందర్నీ ఆకట్టుకుంది. అదే అప్పట్లో ఒకడుండేవాడు. రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టిన ఈ మూవీలో నారా రోహిత్ ఎప్పటిలాగే సూపర్ అండర్ ప్లే చేశాడు. కానీ కొత్త నటుడు కూడా అందర్నీ బాగా ఆకట్టుకున్నాడు.

రైల్వే రాజుగా నటించిన శ్రీవిష్ణు కూడా సూపర్ యాక్టింగ్ లో ఆడియన్స్ మనసు దోచేసాడు. నారా రోహిత్ కంటే శ్రీవిష్ణు పోషించిన రైల్వే రాజు క్యారెక్టర్ కు విమర్శకులు ఎక్కువ మార్కులేశారు. అటు ఆడియన్స్ కూడా కొత్త నటుడి యాక్టింగ్ చూడటానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు.

అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమా కథను కేవలం మూడు నెలల్లో రాశారట. ఈ స్క్రిప్టు పట్టుకుని నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడట శ్రీవిష్ణు. దర్శకుడు సాగర్ తో కలిసి ఫిల్మ్ నగర్, మణికొండలో ఎన్నిసార్లు తిరిగాడో లెక్కలేదట. కానీ ఈ స్క్రిప్ట్ చూసిన రోహిత్.. శ్రీవిష్ణుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.

ఇక ఫిల్మ్ నగర్లో కనిపిస్తే ఊరుకోనని హెచ్చరిస్తూనే.. సినిమా మనమే చేస్తున్నామని చెప్పేశాడట. అప్పట్లో ఒకడుండేవాడు సినిమా స్టోరీపై రోహిత్ కు కాన్ఫిడెన్స్ రావడంతో.. ఆయనే నిర్మాతగా వ్యవహరించారని శ్రీవిష్ణు చెబుతున్నాడు. రోహిత్ కు మంచి విజయంతో పాటు తనకు కూడా మంచి పేరొచ్చిందంటున్నాడు శ్రీవిష్ణు.