నిహారిక పోస్ట్ పై బావ కళ్యాణ్ దేవ్ కామెంట్స్

మెగా డాటర్ నిహారిక కొణిదెల గత ఏడాది డిసెంబర్ 9న చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఒక ఇంటర్వ్యూలో తప్ప, నిహారిక బుల్లితెరపై పెద్దగా సందడి చేయలేదు. అయితే ఈ ఉగాదికి నిహారిక బుల్లితెరకు వస్తోంది. జీ ఛానల్ వారు ఉగాది సందర్భంగా ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి నిహారికతో పాటు నాగబాబు, మంచు లక్ష్మి కూడా విచ్చేసారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నిహారిక ఈ కార్యక్రమానికి వేసుకున్న డ్రెస్ తో ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కాస్ట్యూమ్ గురించి తెలుగులో నిహారిక పోస్ట్ చేయగా దానికి కళ్యాణ్ దేవ్ స్పందించాడు. వావ్ నీహా, నువ్వు తెలుగు ఇంత బాగా రాయగలవని నాకు తెలీదు అని తెలుగులో పోస్ట్ పెట్టాడు. దానికి నిహారిక నవ్వుతూ థాంక్యూ బావగారు అంటూ రిప్లై ఇచ్చింది.