అత్తారింటికి నిహారికకు ద‌గ్గ‌ర ప‌డుతున్న రోజులు

మెగా హీరోయిన్, నాగ‌బాబు త‌న‌య నిహారిక, గుంటూరు ఐజీ ప్ర‌భాక‌ర్‌రావు త‌న‌యుడు చైత‌న్య‌తో నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగ‌స్టు 13న ఇరువైపు కుటుంబ పెద్ద‌ల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విషయాన్ని నాగ‌బాబు త‌న‌యుడు, టాలీవుడ్ యంగ్‌హీరో వ‌రుణ్‌తేజ్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

మెగా కుటుంబం నుంచి మొట్ట‌మొద‌టి సారిగా హీరోయిన్‌గా నిహారిక కొణిదెల త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు వ‌చ్చారు. అయితే త‌న ప్ర‌య‌త్నంలో లోపం లేకుండా ఆమె శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నారు. ఇంకా ఆమెకు హీరోయిన్‌గా స‌రైన గుర్తింపు వ‌చ్చే చిత్రం దొర‌క‌లేదు.

ఇదిలా ఉండ‌గా కూతురు, కొడుకు పెళ్లిళ్లు చేసి బాధ్య‌త‌లు పూర్తి చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు ఆ మ‌ధ్య ఒక ఇంటర్వ్యూలో నాగ‌బాబు చెప్పారు. ముందుగా త‌న కూతురు పెళ్లి చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాన‌ని, బ‌హుశా ఈ ఏడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే ఏడాది మొద‌ట్లో పెళ్లి జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని నాగ‌బాబు చెప్పారు. ఆ మాట ఆయ‌న చెప్పిన కొన్ని రోజుల‌కే నిహారిక సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న పెళ్లికి సంబంధించి వివ‌రాలు రివీల్ చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

నిహారిక వ‌రుస ట్వీట్ల‌తో నాగ‌బాబు కాబోయే అల్లుడిపై ఆరా మొద‌లైంది. వ‌రుడి పేరు చైత‌న్య , అత‌ని తండ్రి గుంటూరు ఐజీ అనే వివరాలు వెల్ల‌డ‌య్యాయి. ఆగ‌స్టు 13న‌ ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో డిసెంబ‌ర్ నాటికి పెళ్లి పూర్త‌య్యే అవ‌కాశాలున్నా య‌ని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. కావున అత్తారింటికి వెళ్లేందుకు నిహారిక‌కు రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయ‌న్న మాట‌.