యంగ్ టైగర్ తో ఇస్మార్ట్ బ్యూటీ.. నిజమెంత?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫామ్ ఇప్పుడు మాములుగా లేదు. వరసగా ఎన్టీఆర్ నటించిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవుతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ నటించిన లాస్ట్ సినిమా అరవింద సమేత తర్వాత ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందని అందరూ అంచనాలు వేసుకుంటున్నారు.

ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇప్పటికే తన తర్వాతి సినిమాను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. ఆర్ ఆర్ ఆర్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో అయినను పోయి రావాలె హస్తినకు అనే చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమా గురించి ఇప్పటికే పలు రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తాడు అంటూ ఒక రూమర్, ఒక ఎన్నారై అని మరో రూమర్ ఇలా బోలెడన్ని వార్తలు సర్క్యూలేట్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నభ నటేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నభ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో స్టార్ డమ్ ను అందుకుంది. ఈ సినిమాలో తన గ్లామర్ యాంగిల్ తో అందరికీ మతులు పోగొట్టేసింది. ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా నిజంగా దొరికిందంటే అది నభ కెరీర్ కు పెద్ద మలుపనే చెప్పాలి