కొరటాల – ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఇప్పుడు బన్నీ వద్దకు వెళ్లిందా

కొరటాల శివ తెలుగు ఇండస్ట్రీలలో టాప్ దర్శకులలో ఒకరు. చేసినవి నాలుగు సినిమాలే అయినా అవి చాలు కొరటాల రేంజ్ చెప్పడానికి. నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అవ్వడమే కాదు, ఆ హీరోల కెరీర్స్ కు అప్పటికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చేస్తున్న కొరటాల తర్వాతి సినిమాపై ఎన్నో ఊహాగానాలు కొన్ని నెలల నుండి ఉన్న సంగతి తెల్సిందే.

నిజానికి కొరటాల శివకు ఎన్టీఆర్ తో కమిట్మెంట్ ఉంది. జనతా గ్యారేజ్ తర్వాత ఇద్దరూ కలిసి పనిచేద్దామనుకున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఒకటి బయటకు వచ్చింది. కొరటాల శివ ప్రాణ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఏమైందో తెలీదు కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

కట్ చేస్తే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. మిక్కిలినేని సుధాకర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ యాక్సెప్ట్ చేశాడంటూ రూమర్స్ మొదలయ్యాయి.

ఏదేమైనా అల్లు అర్జున్ లైనప్ అదిరిపోయిందనే చెప్పాలి. వరసగా ప్రామిసింగ్ సినిమాలతో బన్నీ టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.