నాగ చైతన్యని వాళ్లే దెబ్బ కొట్టారు

‘రారండోయ్‌ వేడుక చూద్దాం’తో కెరియర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టాలనే టార్గెట్‌ అయితే రీచ్‌ అయ్యాడు కానీ, నాగచైతన్య కోరుకున్న బ్లాక్‌బస్టర్‌ డ్రీమ్‌ అలాగే మిగిలిపోయింది. సమ్మర్‌లో పెద్దగా పోటీ లేని టైమ్‌లో రిలీజ్‌ అయిన ‘రారండోయ్‌…’ అల్లు అర్జున్‌ ‘దువ్వాడ జగన్నాథమ్‌’ వచ్చే వరకు షేర్లు రాబట్టుకుంది. అన్ని ఏరియాల షేర్లు, ఇతర గ్యారెంటీలు కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలయ్యాయి. యాభై కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో మినహా మిగతా అన్ని చోట్లా లాభాలు తెచ్చిపెట్టింది.

ఓవర్సీస్‌లో రెండు కోట్లలోపు షేర్‌ రావడం వల్లే ఈ చిత్రం ముప్పయ్‌ కోట్ల మార్కు దాటలేకపోయింది. అర మిలియన్‌ డాలర్లు అయితే వసూలు చేయగలిగింది కానీ చైతన్య ‘ప్రేమమ్‌’ తీరున ఓవర్సీస్‌లో ఇది నిలబడలేకపోయింది. అయితే లోకల్‌ మార్కెట్‌ టేస్ట్‌కి అనుగుణంగా రూపొందడం వల్ల ఈ చిత్రం ఇక్కడ బాగా లాభపడింది.

నైజాంలోనే తొమ్మిది కోట్లకి పైగా షేర్‌ వసూలు కాగా, ఉత్తరాంధ్రలోను మంచి లాభాలు ఆర్జించింది. సీడెడ్‌ బయ్యర్లు బ్రేక్‌ ఈవెన్‌ కాగా, ఆంధ్ర ప్రాంతంలో స్వల్ప లాభాలొచ్చాయి. ప్రతి సినిమాకీ మార్కెట్‌ పరంగా స్ట్రాంగ్‌ అవుతోన్న నాగచైతన్య ఇదే రూట్లో వెళితే మార్కెట్‌ని నికరంగా ముప్పయ్‌ కోట్లు దాటించడం అంత కష్టమేం కాదు.