మాల్దీవుల్లో పరిణీతి చిలౌట్ మూవ్ మెంట్స్!

బాలీవుడ్ బ్యూటీల వెకేషన్ స్పాట్ మాల్దీవులు. సుదూర ప్రయాణాల కన్నా మాల్దీవుల్ని ఉత్తరాది భామలతో బెస్ట్ చిలౌట్ ప్లేస్ గా భావిస్తారు. అందుకే షూటింగ్ ల తర్వాత విరామం గ్యాప్ లో రిలాక్స్ అవ్వడానికి మాల్దీవుల్లో వాలిపోతుంటారు. ఓ వారం పాటు మాల్దీవుల్ ట్రిప్ వేసి రీఫ్రెష్ అయి వెళ్తుంటారు. లాక్ డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి మాల్దీవులు మరింత ఫేమస్ అయింది. ఏడాదిన్నర కాలంగా విదేశీ ప్రయాణాలు నిషేధించడంతో భామలంతా ఇక్కడే వాలిపోతున్నారు. తాజాగా పరిణీతి చోప్రా ఏకంగా సకుటుంబ సపరివార సమేతంగా మాల్దీవులు తల్లిదండ్రులు..సోదరడితో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేసింది.

ద్వీప దేశంలో ఎంజాయ్ చేసిన ప్రతీ మూవ్ మెంట్ ని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. మొదటి ఫోటోలో సింగిల్ గా బీచ్ లో కూర్చొని ఫోటో సెషన్ లో పాల్గొంది. ఇందులో కళ్లకు బ్రాండెడ్ గ్లాసెస్..వదులుగా ఉండే బికినీ ధరించింది. మరో ఫోటోలో ఫ్యామిలీతో అంతా కలిసి ఉన్నది షేర్ చేసింది. ఇందులో తల్లి నీనా..తండ్రి పవన్ చోప్రా..సోదరుడు శివాంగ్ చోప్రా ఫోటోని పంచుకుంది. మరో సోదరుడు సహజ్ చోప్రాని మిస్ అవుతున్నట్లు తెలిపింది. `ఫామ్ జామ్..మా క్యామ్ తీసింది. మిస్ యు స్టుపిడ్ బాయ్ సహజ్ చోప్రా`ని ట్యాగ్ చేసింది. నీటి అడుగు భాగానికి చేరుకుని పరిణీతి యోగాసనాలు వేసినట్లు కనిపిస్తోంది.

మరో ఫోటో లో ఇసుకలో అమ్మడి అడుగుల్ని హైలైట్ చేస్తూ పోస్ట్ చేసింది. ఇంకా మాల్దీవులన్నింటిని దాదాపు కవర్ చేసేసింది. అయితే ఫోటో సెషన్ కోసం నేరుగా తన సొంత ఫోటో గ్రాఫర్లనే మాల్దీవులకు తీసుకెళ్లింది. వాళ్లని తన కుటుంబ సభ్యుల్లా భావించి అన్ని సౌకర్యాలు కల్పించింది. ఇక పరిణీతి చోప్రా సినిమాల విషయానికి వస్తే..రెండు మూడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.