18 ఏళ్ల వయసులోనే తొలి ముద్దు టెస్ట్ చేశానంటున్న హాట్ బ్యూటీ

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ పరిణితి చోప్రా ప్రస్తుతం ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌ సినిమా ప్రమోషన్‌ లో బిజీగా ఉంది. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా కు పాజిటివ్‌ రెస్సాన్స్ వచ్చింది. పరిణితి చోప్రా నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సమయంలోనే పరిణితి చోప్రా విషయమై పలు విషయాలు తెలుపుతూ ఆమె ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. తాజాగా డూ యూ రిమెంబర్ అనే కాన్సెప్ట్‌ తో సోషల్‌ మీడియాలో ఆమె కు సంబంధించిన ప్రశ్నలను సోషల్‌ మీడియాలో అభిమానులు అడగడం జరిగింది. వాటికి చక చక పరిణితి సమాధానం చెప్పింది.

అందులో ముఖ్యంగా మొదటి ముద్దు ఏ సంవత్సరంలో అంటూ ప్రశ్నించగా 18వ ఏట అంటూ తేల్చి చెప్పింది. ఇక తనకు చిన్నతనంలో సైఫ్‌ అలీ ఖాన్ అంటే ఇష్టం అంటూ చెప్పిన ఆమె తాను డేటింగ్‌ కు ఇప్పటి వరకు ఎవరితో కూడా వెళ్లలేదు అంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఆమె తదుపరి సినిమా సైనా పై జనాల్లో ఆసక్తి కనిపిస్తుంది. బ్యాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్ గా రూపొందుతున్న సైనా సినిమా లో పరిణితి చోప్రా లుక్‌ ఇప్పటికే రివీల్‌ అయ్యింది. సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా లుక్‌ ఉంది.