పవన్‌ ను కారణం లేకుండా ద్వేషించా

హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలం పాటు ప్రయత్నాలు చేసి ఇక ఆశ వదిలేసుకుని కెరీర్‌ లో నిలదొక్కుకోవడం సాధ్యం అయ్యే పని కాదని నిర్ణయానికి వచ్చి బుల్లి తెరపై బిజీ అయ్యేందుకు ప్రయత్నించడంతో పాటు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యేందుకు మాధవి లత ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఆమె సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తాజా క్యాష్‌ షో లో ఈమో హడావుడి చేసింది.

క్యాష్‌ షో లో సుమతో కొంత సమయం హడావుడి చేసింది. ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావన రావడంతో తనకు పవన్‌ పై ఎంత ప్రేమ ఉందో చెప్పే ప్రయత్నం చేసింది. నీపై ఆశపడటం తప్పే, అందుకోవాలనుకోవడం తప్పే అయితే నువ్వు అంటే చాలా ప్రేమ ఉంది. కారణం లేకుండానే గతంలో నిన్ను ద్వేషించాను. నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ తో పొట్లాడాను. నువ్వంటే తెలిశాక ఇష్టం పెరిగిందని తాను పవన్‌ కు రాసుకున్న లేఖ లో పేర్కొంది.