పవన్ ఫ్యాన్స్ కోరికను దిల్ రాజు మన్నిస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ చిత్రంగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్ర రీమేక్ లో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి మే15కు చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే అనుకోకుండా కరోనా వైరస్ ప్రభావం ప్రపంచాన్ని కుదిపేయడంతో పింక్ రీమేక్ షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ రీమేక్ కు వకీల్ సాబ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా పరిస్థితులు చక్కబడే వరకూ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కూడా ఇంటికే పరిమితమయ్యాడు.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజును జరుపుకోనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ అడ్వాన్స్ గా సోషల్ మీడియాలో రచ్చ షురూ చేసారు. పవన్ కు పుట్టినరోజు శుభకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో రికార్డ్స్ ను తిరగరాస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు వకీల్ సాబ్ టీజర్ ను వదలాలని దిల్ రాజు ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరీ కోరుతున్నారు.

మహిళల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని పాట మగువా మగువాను విడుదల చేసిన సంగతి తెల్సిందే. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరికను దిల్ రాజు మన్నిస్తాడో లేదో చూడాలి.