మరో పవన్ టైటిల్… క్రిష్ సైలెన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాకుండా మరో సినిమాను ఒప్పుకున్న విషయం తెల్సిందే. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ ఫోక్ లోర్ డ్రామాను పవన్ చేస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందు దాదాపు 15 రోజుల షూటింగ్ ను పూర్తి చేసారు. ఐతే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరిగే ఛాన్స్ లు తక్కువగానే కనిపిస్తున్నాయి.

క్రిష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుండి ఈ సినిమాపై బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఇప్పటికే పలు టైటిల్స్ వినిపిస్తున్నాయి. విరూపాక్ష, గజదొంగ, బందిపోటు, ఓం శివమ్ వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే వేటినీ క్రిష్ అండ్ టీమ్ ఖండించలేదు.

ఇక రీసెంట్ గా ఈ సినిమా రైటర్ సాయి మాధవ్ బుర్రా అంతర్వాహిణి పేరుతో ఒక కవిత లాంటిది రాసాడు. దానికి పవన్ కళ్యాణ్, క్రిష్ లను ట్యాగ్ చేసాడు. క్రిష్ కూడా తన సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేసుకున్నాడు. దీంతో ఈ సినిమాకు అంతర్వాహిణి అనే టైటిల్ కన్ఫర్మ్ అయిందా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై కూడా క్రిష్ సైలెంట్ గానే ఉన్నాడు.

మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు క్రిష్ టైటిల్ రివీల్ చేస్తాడని అన్నారు కానీ ప్రీ లుక్ తోనే సరిపెట్టాడు. మరి దసరా కోసం ఎదురుచూడండి అని క్రిష్ హింట్ ఇచ్చాడు అంటే అప్పుడు టైటిల్ ను రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.