హాట్‌ పిక్‌: వామ్మో ఇలా రెచ్చిపోతోందేంటీ?

హాలీవుడ్‌లో అడుగు పెట్టిన తర్వాత బాలీవుడ్‌ లెవల్లో ఎక్స్‌పోజింగ్‌ చేస్తే సరిపోదని అనుకుంటుందో ఏమో కానీ దీపికా పడుకోన్‌ డోస్‌ పెంచేసింది. ఒకసారి ఒక న్యూస్‌ పేపర్లో తన క్లీవేజ్‌ షో గురించి రాసారని సోషల్‌ మీడియాకెక్కి కోప్పడిపోయిన దీపిక ‘అప్పుడేం చూసారెహే… చూడాల్సింది చాలా వుంది’ అన్నట్టుగా రెచ్చిపోతోంది. ‘ట్రిపులెక్స్‌’ అనే హాలీవుడ్‌ సినిమా ప్రమోషన్స్‌లో దీపిక తన తోటి హీరోయిన్లకి ఎక్స్‌పోజింగ్‌ పరంగా బెంచ్‌మార్క్‌ సెట్‌ చేస్తోంది.

ఈ చిత్రం ప్రీమియర్‌ షో సందర్భంగా పూర్తి క్లీవేజ్‌ కనిపించే డ్రస్‌ వేసుకుని దీపిక లుంగీ డాన్స్‌ చేస్తోంటే చూస్తున్న వాళ్లకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. గతంలో దీపిక హాట్‌ షో చూసిన వాళ్లు సైతం గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. ఈ లెవల్లో గీత దాటుతూ పోతే రానున్న రోజుల్లో దీపిక హాలీవుడ్‌ హీరోయిన్ల మాదిరిగా సర్వం ప్రదర్శించడానికీ వెనుకాడదో ఏమో అంటూ సాంప్రదాయవాదులు నిప్పులు చెరుగుతున్నారు.

రోమ్‌లో వున్నప్పుడు రోమన్‌లా వుండాలంటారు కనుక హాలీవుడ్‌ వెళ్లినప్పుడు అందుకు తగ్గట్టే డ్రస్సులుండాలనేది దీపిక ఫిలాసఫీ అన్నట్టుంది మరి. అయినా అందాల భామ చూసుకోండమ్మా అంటూ అందాల విందిస్తోంటే, కంప్లయింట్స్‌ ఏమిటండీ బాబూ సిరాగ్గా!